నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మారిన రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయన్నది ఎవరు కాదనలేని వాస్తవం. ప్రతిపక్షంలో తమకు భవిష్యత్తు లేదనుకున్న ఎందరో శాశనసభ్యులు , నియోజకవర్గ ఇంచార్జులు అధికార పార్టీలోకి వెళ్ళడానికి గాను రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే గతంలో జగన్ ఊపు చూసి ఆ పార్టీలోకి వెళ్లిన కొంత మంది నేతలు మళ్ళి చంద్రబాబు దగ్గరకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు...వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం...
జగన్ పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ రెడ్డి అభిమానం జగన్ కి బాగానే కలిసి వచ్చింది.. జగన్ ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వారు ఉన్నారు... ఈ ఊపు చూసిన ఇతర పార్టీల నేతలు రాజీనామాలు చేసి మరి జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరి ఓదార్పులో తమ వంతు కృషి చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొంత మంది గెలిచారు కొంత మంది ఇంచార్జులుగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది...
గెలిచిన వాళ్ళని కాసేపు పక్కన పెట్టి గెలవని వాళ్ళని ప్రస్తావిస్తే... గత ఎన్నికల్లో జగన్ ఊపుతో గెలుస్తామన్న ఎందరో నాయకులు తమకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై నోటికి వచ్చిన విధంగా కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఓడిపోవడంతో ఆ నేతలు దాదాపు కనుమరుగు అయిపోయారనే చెప్పాలి.. రాజకీయం అంటే ఆశక్తితో ఉన్న కొందరు మాత్రం ఇక తమకు ఆ పార్టీలో ఉంటె భవిష్యత్తు లేదని తిరిగి తెలుగుదేశంలోకి వెళ్తే తమకు ఎంతో కొంత గుర్తింపు ఉంటుందని భావించి మళ్ళి తెలుగుదేశం గడప తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.. ఇందుకోసం తమకు సన్నిహితంగా ఉండే తెలుగుదేశం నేతలతో వారు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.