అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కలియుగ వైకుంఠ మూర్తికి పట్టువస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయడు.
అలిపిరి ఘటనలో శ్రీవారి ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మారాలని, ప్రతి ఒక్కరికి తాగునీరు అందాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని కోరుకున్నాని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో టీటీడీ పాలకమండలి నియామకం చేపడతామాని, తిరుమల భక్తులపై జీఎస్టీ భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరరామన్నారు. 2018 క్యాలండర్, డైరీ, తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
Advertisements