చంద్రబాబు చైనా పర్యటనలో ఏమి సాధించారు అనే వారికి సమాధానం ఇది... 2015లో చంద్రబాబు పెట్టుబడుల కోసం చైనా పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పర్యటన సాగుతున్న అంత సేపు జగన్ విమరిస్తూనే ఉన్నారు... చంద్రబాబు ఎంజాయ్ చెయ్యటానికి వెళ్లారు అని ఒకరు, చంద్రబాబు మొఖం చూసి ఎవడు పెట్టుబడులు పెడతారు అని ఒక వైపు విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు వారందరికే చెంప పెట్టు ఈ న్యూస్..

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనాకు చెందిన జియాన్‌ లోంగీ సిలికాన్‌ మెటీరియల్స్‌ కార్పొరేషన్‌ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించనుంది. తొలి విడత రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు, 5 వేల మందికి ఉపాధి రానుంది.

వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ సెల్స్‌, మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ మాడ్యూళ్లను ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారు చేసిన వాటిని విదేశాలకూ ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు అక్కడే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థ ఉత్పత్తి చేసి.. రాష్ట్రానికి విక్రయించనుంది.

దీనికి సంబంధించి పనులు అన్నీ చక చక జరుగుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నాటికి, ప్లాంట్ కి ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన చేసి, సాధ్యమైనంత త్వరలో కంపెనీ ప్రారంభించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read