ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్తుంటే, సాక్షి పేపర్ ఎలా రాసిందో చూసాం... తెలంగాణా ఎడిషన్ లో వాళ్ళని రెచ్చగొడుతూ, ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తోడేస్తుంది అని రాశారు... ఇక్కడేమో, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎక్కువ నీళ్ళు తోడలేదు అని రాసింది సాక్షి...
ఈ విషయం మీద సోషల్ మీడియాలో విపరీతమైన రియాక్షన్ వచ్చింది... సాక్షి వక్ర బుద్ధిని సోషల్ మీడియా వేదికగా అందరూ ఎండగట్టారు... కాని తెలుగుదేశం వైపు నుంచి ఒక్కరు కూడా, ఈ విషయం మీద మాట్లాడలేదు... మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి వార్తలు ఖండిచక పొతే, ప్రజలకు విషయాలు ఎలా తెలుస్తాయి ? ఈ ఒక్క విషయం అనే కాదు, చాలా విషయాల్లో చేసింది చెప్పుకోవటం దగ్గర నుంచి, విష ప్రచారాన్ని తిప్పి కొట్టే దాకా తెలుగుదేశం ఫెయిల్ అవుతూనే ఉంది....
చివరకి సాక్షాత్తు ముఖ్యమంత్రి సాక్షి వక్ర బుద్ధి మీద స్పందించాల్సి వచ్చింది. రాయలసీమకు నీళ్లు ఇస్తే, నీళ్లు దొంగిలిస్తున్నానంటూ జగన్ పత్రిక రాయటం పై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పులివెందుల, కడపకు నీళ్లిచ్చినా భరించలేరా? ఎంత నీచం... ఎంత దుర్మార్గం. వీళ్లు మనుషులేనా... తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా అక్కడ రాతలు రాస్తారా... పట్టిసీమ, గండికోట, అమరావతి ఏ పని చేసినా అడ్డుపడ్డారు. ఇలాంటి వారిని ఏమనాలి? మనూరికి నీళ్లు ఇచ్చినా ఓర్చుకోలేని అసూయ మనుషులకుంటే ఎలా....' అంటూ ముఖ్యమంత్రి సాక్షి రాతలని ప్రజలకు అర్ధమైయ్యేలా వివరించారు...
ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మారతారమే చూద్దాం...