రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చిన, గోరంతను కొండంత చేసే జగన్ పార్టీ, జగన్ పైడ్ సోషల్ మీడియా వర్కర్స్, సాక్షి టీవీ, ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు స్పందించలేదు ? చివరకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించినా, బాధ్యత గల ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడడా ?

కాపు రిజర్వేషన్ల విషయంలో కాని, గరగపర్రు విషయంలో కాని రెచ్చిపోయి రచ్చ చేసిన జగన్, ఎందుకు నోరెత్తటలేదు ? ప్రతి పక్ష నేత అని మర్చిపోయాడా ? లేక వారు ఎలాగూ నాకు వోట్లు వెయ్యరు, వాళ్ళ గురించి నేనెందుకు పట్టించుకోవాలి అనుకుంటున్నాడా ?

ఆర్య వైశ్యులని "సామిజక స్మగ్లర్ లు" అంటూ కంచె ఐలయ్య రాసిన పుస్తకం, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.... ఒక కులాన్ని డైరెక్ట్ గా నిందిస్తూ, కంచె ఐలయ్య రెచ్చిపోతుంటే, ఆ సామజిక వర్గం ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, వారి తరుపున ఇప్పటివరకు మాట్లాడలేదు ప్రతిపక్ష నాయకుడు...

చంద్రబాబు, డిజిపితో రివ్యూ జరిపి, అన్ని చట్ట పరమైన చర్యలు తీసుకోమన్నారు.. ఒక కులాన్ని నిందించే హక్కు ఎవరకి లేదు అని, ఆ పుస్తకాన్ని రాష్ట్రంలో నిషేదించాలి అని కూడా చెప్తూ, ఆర్య వైశ్యులకి అండగా నిలబడ్డారు చంద్రబాబు... మరి జగన్ ఏమి చేస్తున్నాడు ? ఈ విషయం మీద కూడా, ఆఫ్టర్ టు ఇయర్స్ సియం అయిన తరువాత మాట్లాడతాడా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read