చంద్రబాబు ఒకటి అనుకుంటే అది జరిగి జరిగితీరుతుంది. అందుకోసం ఎంత కష్టపడతారో, ఎంత దూరం వెళ్తారు అనేది అందరికీ తెలిసిందే... ఆ మాటలు అక్షరాలా నిజమని మరోసారి స్పష్టమైంది. అది రాజకీయమైనా తాను ప్రజలకు చెయ్యాలనుకునే పనైనా సరే... ఇంతకీ విషయం ఏంటో ఒక్కసారి చూద్దాం... పోలవరం పై సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా ప్రాజెక్ట్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు...
ఇందుకోసం ఎన్నడూ లేని విధంగా కష్టపడుతూ వారంలో ఒక రోజు ఈ ప్రాజెక్ట్ కె కేటాయించి మరి ఆయన కష్టపడుతున్నారు. పట్టిసీమని ఏడాదిలో పూర్తి చేసిన ముఖ్యమంత్రి, పోలవరానికి అదే స్థాయిలో కష్టపడుతున్నారు. నెలకి ఒకసారి అయినా పనులను పరిశీలిస్తూ పనులు ఎక్కడి వరకు వచ్చాయనే దానిని ఆరా తీస్తూ సాగు నీటి ప్రాజెక్టలపై సమీక్ష నిర్వహిస్తే దాంట్లో అధిక భాగం పోలవరంపైనే చర్చిస్తూ వస్తున్నారు.
అనుకున్న సమయానికి ఇది పూర్తి అయితే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిష్ట మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు... ఎప్పటికప్పుడు పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి పనుల్లో జాప్యం జరుగుతుందని గమనించారు... దీని వెనుక ఎవరు ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికి తెలిసిన బహిరంగ వాస్తవమే... ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పని తీరు బాగాలేదని పసిగట్టిన చంద్రబాబు వెంటనే ఆ కంపెనీకి నోటీసులు జారీ చేశారు...
చంద్రబాబు వార్నింగ్ లు ఇప్పటిదాకా లైట్ తీసుకున్న అధికారులు, కాంటాక్ట్ కంపెనీ, చంద్రబాబు పోలవరం పనుల్లో ఇంత సీరియస్ గా ఉన్నరాని అంచనా వెయ్యలేక పోయారు... ఇక నుంచి అయినా, అధికారులు, కాంటాక్ట్ కంపెనీ, షడ్యుల్ ప్రకారం పనులు చేస్తారని ఆశిద్దాం...