తిరుపతి రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో టీవీలు,సెక్యురిటి కెమెరాలు, తయారీని డిక్సన్ కంపెనీ ప్రారంభించింది. త్వరలో సెల్ ఫోన్లు, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రారంభించేందుకు డిక్సన్ కంపెనీ రెడీ అవుతుంది.

రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో మొట్టమొదట కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీగా డిక్సన్ కంపెనీ పేరు తెచ్చుకుంది. మార్కెట్లోని వివిధ కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేసి ఇస్తుంది.

ఈ కంపెనీ రాష్ట్రంలో 150 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అయితే 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

డిక్సన్ కంపెనీ లో తయారు అయిన మొట్ట మొదటి టీవీ ని తిరుమల లో వెంకటేశ్వర స్వామి కి సమర్పించింది డిక్సన్ కంపెనీ. కంపెనీలో తయారు అయిన రెండోవ టివిని మంత్రి నారా లోకేష్ కి ఇచ్చారు కంపెనీ ప్రతినిధులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read