మహానటి సావిత్రి సాహిత్య, సాంస్కృతిక కళా పీఠం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సన్మానానికి వచ్చిన సినీనటుడు కైకాల సత్యన్నారాయణ ముద్రగడకు తగిలేలా పంచ్ వేశారు...
"కాపులు ఏ రంగంలోనూ ఏ వర్గంతోనూ తీసి పోరు.. అలాంటప్పుడు రిజర్వేషన్లు అంటూ దిగజారి ఎవరినీ దేబిరించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్లు రాబోతున్నాయంటూ విద్యారులు, యువతలో పోటీతత్వాన్ని నీరుగార్చద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు..
వెనుకబడుతున్నామని మనకు మనమే కించపరచుకుంటూ బిసిలుగా గుర్తించాలని, రిజర్వేషన్లు కావాలంటూ ఆరాటం ఎందుకని అన్నారు. కళారంగంలో ఎస్వీ రంగారావ ఏనాడూ తలవంచలేదని, అలాగే కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు ఈ వర్గంలో అనేకమంది ఉన్నారని మర్చిపోవద్దు అన్నారు.
మన పిల్లలు బాగా చదువుకునేలా మనమే చెయ్యాలి అని, అలాంటప్పుడు ఈ రిజర్వేషన్లతో పని లేదన్నారు...
అలాగే తన సినీ జీవితం, రాజకీయ జీవితం గురించి మాట్లాడారు.. తెలుగుదేశం పార్టీలో మచిలీపట్నం నుంచి ఎలా ఎంపి అయ్యింది, తరువాత తన కులం వాళ్ళే తనను ఓడించటంతో రాజకీయాలకు దూరంగా ఉండటం, తరువాత పార్టీ తనను పూర్తిగా మర్చిపోవటం, ఇలా అన్ని విషయాలు మాట్లాడారు...