ఆంధ్రప్రదేశ్ లో, మరో ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు బీజం పడనుంది... విశాఖలో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ నగరంలో పాండురంగాపురం 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. 2014 అక్టోబర్ 12న ఇక్కడ సంభవించిన హుదూద్ తుపాను ఓ గుణపాఠం నేర్పింది. దీంతో అప్రమత్తమైన సంస్థ తక్షణ కర్తవ్యాన్ని చేపట్టింది.

విశాఖ వంటి మహానగరంలో హుదూద్ వంటి భారీ తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలతో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు భూగర్భ విద్యుద్దీకరణ తప్పనిసరిగా భావించి ప్రణాళికలు రూపొందించింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, తరువాత ప్రపంచ బ్యాంకుకు సిఫారసు చేయడం, దీనికి సంబంధించిన బృందం ఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయడం వేగంగా జరిగిపోయాయి.

నగరంలో నాలుగు ప్యాకేజీల కింద 276 కిలోమీటర్ల మార్గంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు రూ.760 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనాతో ప్రతిపాదనలు పంపగా, దీనికి ఆమోదం తెలిపింది. దీని తరువాత ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోల్‌కతాకు వెళ్ళి శిక్షణ పోందడం, నిధులు మంజూరైన తరువాత తొలి మూడు ప్యాకేజీల ప్రాజెక్టుకుగాను టెండర్లు ఖరారు చేయడం కూడా పూర్తయ్యింది. వీటన్నింటికీ చెంనిన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఏకంగా మూడేళ్ళకాలం పట్టింది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈనెల 9న సిఎం శంకుస్థాపన చేస్తారు.

18 మాసాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేయ్యనుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు, హుదూద్ వంటి తుపాన్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అధిగమించడం, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు కోట్లాది రూపాయల మేర వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అలాగే విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించినందున ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read