హేళనగా.. అవమానకరంగా, అమరావతిని భ్రమరావతి అని మాట్లాడినవారికి అభివృద్ధే సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. నీరుకొండకు చేరువలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ, మరి కొద్ది వారాల్లో తరగతులను మొదలు పెట్టబోతున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని జూలై 15 న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో 240మందికి అవకాశం కల్పిస్తున్నారు.
రూ.3వేలకోట్లతో నిర్మిస్తోన్న ఎస్‌ఆర్‌ఎంని మొదటి దశలో 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.
Advertisements