న్యాయం చేయవయ్యా సామీ అని ప్రతిపక్షనేతని పిలిస్తే బాధితులని బొక్కలో తోయాలని తొక్కలో సలహా ఇచ్చాడు. వైఎస్ జగన్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను పరామర్శించాలి అని బయలుదేరి వెళ్ళాడు... తీరా అక్కడ చూస్తే ఈయన ఏమి మాట్లాడాడో తెలుసా, "చట్టం తన పని తాను చేసుకుపోయి ఉంటే, విషయం ఇక్కడ దాక వచ్చేది కాదంట... విషయం తెలిసిన వెంటనే, భాదితులని అరెస్ట్ చేసి లోపల వేసి ఉండాల్సింది అంట"...
ఇప్పుడేటంటారు ? బాధితుల్ని అరెస్ట్ చేయమన్నందుకు నోబెల్ ఇద్దామా ? లేక ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఇద్దామా ? ఫ్రంట్పేజీలో వేద్దామా ? లేక ఎడిటోరియల్లో రాద్దామా ? తెలుగు ట్యూషన్ పెట్టిద్దామా లేక పెద్దబాలశిక్ష చదివిద్దామా ?
జగన్ ని దళిత ద్రోహి అందామా ? "బాధితులకు" "నిందితులకు" తేడా తెలియని ప్రతిపక్ష నాయకుడు అందామా ? రాజన్న రాజ్యంలో, బాధితులని అరెస్ట్ చేస్తాం, నిందితులని వదిలేస్తాం, అందామా ?
మాట్లాడేప్పుడు "టంగ్స్లిప్" సర్వసాధారణం. చంద్రబాబు కైనా, లోకేష్ బాబు కైనా, జగన్ బాబు కైనా, రాజశేఖర్ రెడ్డి బాబు కైనా, నీ కైనా, నా కైనా, ఎవరైనా ఎదో ఒక సందర్భంలో, మాటలు తడబతాయి... నిర్మాణాత్మక విమర్శ చేయడానికి ఏ టాపిక్కూ లేకపోతే, ఇలాంటి దివాళాకోరు సందర్భాలను రచ్చ చేస్తారు.