బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి క్లినిక్, సమాచార కేంద్రాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం విజయవాడలో ప్రారంభించారు. గవర్నర్ పేటలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా, ఎం.వి.ఎస్. మూర్తి, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టినగడ్డపై క్యాన్సర్ ఆస్పత్రి సేవలు ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఆగస్టులో భూమి పూజ చేస్తామని బాలకృష్ణ చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నమ్మకానికి చిరునామా బసవతారకం ఆస్పత్రని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమానికి కోడెలతోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ తో మా అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని ఆసుపత్రి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పన్ను రద్దు చేసిందని... అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.