ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది..బీజేపీ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న కోపం ప్రజల్లో నెలకొంది.. అయితే ఆరిపోతున్న దీపానికి కాసింత చమురు అందించే ప్రయత్నంలో పడ్డారు ప్రధాని నరేంద్రమోదీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఇందుకోసం వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.. బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాలి.. కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తోందనీ... ఏపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే నిధులు రాకుండా ఆగిపోయాయని జనానికి చెప్పాలి. ఇలా ఇచ్చిన బాధ్యతలను ఎంపీలు.. ఎమ్మెల్యేలు సక్రమంగా నిర్వర్తించాక కేంద్రమంత్రులను ఏపీకి పంపించాలన్నది బీజేపీ హైకమాండ్‌ ఆలోచన..

bjpleaders 01072018 2

అసలు విషయానికి వస్తే ఎప్పుడూ నెల్లూరు వైపు కన్నెత్తి కూడా చూడని కమలం పార్టీ ఎంపీ గోకరాజు గంగరాజు అకస్మాత్తుగా సింహపురిలో వాలిపోయారు. విశేష్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగానే గోకరాజు నెల్లూరుకు వచ్చారని బీజేపీ వాళ్లే చెప్పారు. ఈ క్రమంలోనే నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అతిథిగృహంలో గోకరాజు గంగరాజు సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు కూడా వచ్చారు. ఇక సమావేశంలో గోకరాజు బీజేపీ గొప్పదనాన్ని.. నరేంద్రమోదీ ఏపీకి చేసిన మేళ్ల గురించి పెద్ద ప్రసంగమే చేశారు.. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.. చివర్లో పార్టీ నేతలు.. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో కలిసి ఓ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ గంగరాజుకు షాకుల మీద షాకులు తగిలాయి.. ఆయన స్పీచ్‌ స్టార్ట్‌ చేయగానే... సమావేశానికి వచ్చిన వారంతా అంతెత్తున లేచారు.. ఏపీకి బీజేపీ ఏం చేసిందండీ.. అంటూ సూటిగానే ప్రశ్నించారు.. నోట్ల రద్దు.. జీఎస్టీ కారణంగా జనం ఇంకా ఇబ్బందులు పడుతున్నారని.. పైగా పెట్రో ధరలు అమాంతం పెంచేయడంతో ప్రజలు పార్టీని తిట్టిపోస్తున్నారని గంగరాజుకు గట్టిగానే చెప్పారు.

bjpleaders 01072018 3

అమరావతికి నిధులు ఎందుకు ఇవ్వరు..? కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు అనుమతి ఇవ్వరు..? విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి..? పోలవరం నిధుల మాటేమిటి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గంగరాజుకు దిమ్మతిరిగే షాకిచ్చారు.. సమావేశానికి వచ్చినవారంతా ఉన్నత విద్యావంతులే! ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారే! సమావేశం వేడెక్కడంతో అక్కడ ఉన్న కొందరు బీజేపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. ఇప్పుడు ఇవన్నీ వద్దు.. బయట మీడియా ఉందని అని చెప్పి సమావేశాన్ని ముగించారు. సమావేశానికి వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం గంగరాజు వల్ల కాలేదు.. పైగా వారి కోపాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తంమీద ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో నెల్లూరు పర్యటన ద్వారా బీజేపీ నేతలకు బాగా అర్ధమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read