కొండవీడు కోటకు ఎంత చారిత్రక నేపధ్యం ఉందో అందరికీ తెలిసిందే. మన ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం ఈ కొండవీడు కోట. 1700 అడుగుల ఈ కొండ శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2007లో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాని ఎవరూ పట్టించుకోలేదు, అవి కాగితాలకే మిగిలిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 2015లో ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. ఇప్పుడు పనులు దాదాపుగా అయిపోయాయి.

ghatroad 09072018 2

యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు కొండ మీదకు 5.1 కి.మీ దూరం ఉండే ఘాట్‌రోడ్డు నిర్మిస్తున్నారు. 30 కోట్ల వ్యయంతో రెండున్నర ఏళ్ల క్రితం, 2015 చివరిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. ఇక్కడకు వచ్చే పర్యటకులు వారి వాహనాలు పార్కింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఘాట్‌రోడ్డు మధ్యలో కాంక్రీటు ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. ఇప్పటికే 50 ఎం.ఎం. మందంలో ఒక లేయర్‌ తో తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. 30 ఎం.ఎం మందంలో మరో లేయర్‌ తారు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ghatroad 09072018 3

ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఘాట్‌రోడ్డు నిర్మాణం, కొండ పైన ఉన్న బురుజు వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి కొండల మధ్యన ఉన్న దేవాలయాలు, చెరువులు, బురుజులు ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి కొంత దూరం నడక దారిన కొండ దిగి కిందకు రావాలి. ప్రస్తుతం ఘాట్‌రోడ్డును మైదాన ప్రాంతం వరకు కొనసాగించడం వలన పర్యాటకులు వాహనాలతో దేవాలయాల వద్దకు చేరుకునే సౌకర్యం లభిస్తుంది. అప్పుడే కొండవీడుకు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొండ మీద చారిత్రక కట్టడాల పరిరక్షణకు, నూతన కట్టడాల చేపట్టడానికి వాహనాలు చేరుకొనే అవకాశం ఉంటుంది. ఘాట్‌రోడ్డు రెండో దశ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read