గత మూడు రోజుల నుంచి, అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలు, విభజన హామీల పై, సుప్రీంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై రాగాలిపోతున్నారు. రెండు పార్టీలు తప్ప.. వారే, జగన్, పవన్... వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు చత్వారం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పటికే విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్ని చదివేందుకు వారిద్దరికీ ఇంకా పెద్ద భూతద్దాలేమైనా కావాలా? అసలు సమస్య ఎక్కడుందో? పరిష్కారం కోసం ఎక్కడ పోరాడాలో తెలియకుండా.. ముందుగా నేను ప్రస్తావించడం వల్లే హోదా అంశం సజీవంగా ఉందంటూ జగన్, పవన్ ఎక్కడపడితే అక్కడ మాట్లాడుతున్నారు.
ఇప్పుడు, హోదాను అటకెక్కిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంకా ఆ అంశం సజీవంగా ఎక్కడుంది? హోదా, విభజన హామీల అమలుపై మోదీపై పోరాడాల్సిన జగన్, పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఇప్పుడు మోదీకి భయపడితే.. భవిష్యత్తులో వారు ప్రజలకు ఇంక సేవ చేస్తారా? చేయగలరా? రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాల వైఖరిని గుర్తించాలి. మేము అన్నీ ఇచ్చేసాం అంటున్నారు. హోదా అవసరం లేదు అంటున్నారు. పోలవరం పై మడత పేచి పెట్టారు. రైల్వే జోన్ పై కనీసం ప్రస్తావించలేదు. సాక్షాత్తు సుప్రీం కోర్ట్ కే అబద్ధాలు చెప్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే, అన్ని పార్టీలు స్పందిస్తే, పవన్, జగన్ లకు ఏమి అయ్యింది ?
ఎంత అమిత్ షా, వీరి బాస్ అయితే మాత్రం, బీజేపీ నాయకులు లాగా, జగన్, పవన్ కూడా గుజరాతీ భజన చేస్తారా ? వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టవా ? ఒకాయిన కేసుల కోసం లొంగిపోతే, ఇంకో ఆయన ఎందుకో లోంగాడో కాని, మొత్తానికి, అమిత్ షాకి బాగా లొంగిపోయారు. రాష్ట్రంలో ప్రజలందరూ కేంద్రం పై పోరాడుతుంటే, జగన, పవన్ మాత్రం, కేంద్రం పై పోరాడుతున్న, చంద్రబాబు పై విరుచుకుపడుతూ, వారి గుజరాతీ భక్తి ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ కలిసి, ఒకే ఎజెండా, ఒకే మాట, ఒకే స్క్రిప్ట్, ఒకే డైలాగ్ లు కొడుతున్నారు. ఒకడు కాల్చేస్తా అంటే, ఇంకొకడు చొక్కా పట్టుకుని లాగి, కాళ్ళు విరగ్గొడతా అంటాడు. అంతే కాని, మోడీని మాత్రం, అనే దమ్ము ఇద్దరికీ లేదు.