రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పై, జగన్, పవన్, బీజేపీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ పని తీరుని, చంద్రబాబు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ని హేళన చేస్తూ మాట్లాడతారు. నిజానికి, కేంద్రం కావాలని, ఈ ప్రాజెక్ట్ లేట్ చేస్తుంది. ఆరు పిల్లర్లకు డిజైన్ లు, నిన్నటికి ఆమోదం లభించింది అంటే, కేంద్రం మన పై ఎంత శ్రద్ధ చూపిస్తుందో అర్ధమవుతుంది. ఒక పక్క నిధులు ఇవ్వక, మరో పక్క డిజైన్ లు ఆమోదం లభించక, ఈ ప్రాజెక్ట్ ఇలా సాగుతుంటే, ప్రతిపక్షాలకు మోడీని అడిగే దమ్ము లేదు కాని, చంద్రబాబు మీద పడిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా, ఈ ఫ్లై ఓవర్ పై తాజా అప్డేట్ వచ్చింది. కనకదుర్గ ఫ్లై ఓవర్ డిజైన్ లను, ఎట్టకేలకు ఖరారు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ముంబయికి చెందిన ఓ సంస్థ వీటిని రూపొందించింది.

floyver 06072018 2

ఫ్లై ఓవర్ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని సోమా కనస్ట్రక్షన్‌ సంస్థ ఎండీ హామీ ఇచ్చారు. వచ్చేఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీనికి జనవరి 26కు అవకాశం ఇవ్వాలని ఎండీ కోరినట్లు తెలిసింది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణంపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరికి ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం 70శాతం పనులు పూర్తయ్యాయి. 62 శాతం బిల్లులు చెల్లించారు. బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం నుంచి కొంత సమస్య ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

floyver 06072018 3

ఫ్లై ఓవర్ మలుపు తిరిగే ప్రాంతంలో డయాగ్నల్‌గా నిర్మాణం చేయాల్సి ఉంది. అక్కడ సరిపడే స్థలం లేకపోవడంతో పియర్స్‌ ఒకవైపే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి ఆకృతులను కేంద్రం మొదట తిరస్కరించింది. ఎట్టకేలకు ముంబయికి చెందిన సంస్థ రూపొందించి అంతర్జాతీయ సంస్థతో ధ్రువీకరణ పొందడంతో సీడీఓ ఆమోదం తెలిపింది. నగరపాలక సంస్థ పంపుహౌస్‌ దగ్గర రెండు పిల్లర్లు, నదిలో రెండు పిల్లర్లు, దర్గా ప్రాంతంలో రెండు పిల్లర్లను ఈ విధంగా నిర్మాణం చేయనున్నారు. సాధారణంగా పిల్లర్‌ మీద రెండు వైపులా పియర్స్‌ ఏర్పాటు చేసి వాటిపై స్పాన్‌లు ఏర్పాటు చేస్తారు. సాదారణంగా 16 మీటర్లకు రెండు పియర్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత డిజైన్ల ప్రకారం 16 మీటర్లకు ఒకవైపు ఒక పియర్‌ ఏర్పాటు చేస్తారు. అయితే ఎట్టకేలకు డిజైన్ ల ఆమోదం లభించటంతో, నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read