పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో, ఢిల్లీ ఇచ్చిన స్క్రిప్ట్ తో ఉత్తరాంధ్రలో వేర్పాటు వాదం తీసుకురావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని పవన్ మాట్లాడే లాజిక్ లేని మాటలే అర్ధం కావటం లేదు. ఉత్తరాంధ్రని దోచుకుంటున్నారు అంటూనే, ఉత్తరాంధ్రను అభివృద్ధి చెయ్యట్లేదు అంటాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు భూములు అంటూ అనాలోచితంగా మాట్లాడినా, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రము అంటూ ఆయాసంగా మాట్లాడినా ఆయనకే సాధ్యం. ఏదన్నా వింటే అర్ధం కాదు, ఆలోచిస్తే అవుతుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ గురించి తెలిసిందే. అది ఎంత పెద్ద కంపెనీనో ప్రపంచం మొత్తం తెలుసు. ఆ కంపెనీ కోసం 5 రాష్ట్రాలు పోటీ పడితే, చివరకు మన రాష్ట్రానికి సాధించారు చంద్రబాబు. అవకాశాలు లేకుండా ఇంత పెద్ద కంపెనీ పెట్టుబడులు పెట్టదు. అంతర్జాతీయ కంపెనీలు ఉత్తరాంధ్రలో అవకాశాలు గుర్తించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, అనుమతులను త్వరితగతిన ఇస్తుంది.
అభివృద్ధి చెందాలి అంటే కంపెనీలు రావాలి, అర్హత కల ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతుల్లో లోపాలను ఎత్తిచూపొచ్చు, నియమాలను పాటించకపోతే వివరాలు అడగొచ్చు. అనుమానాలు లేపుతూ ప్రజలను పక్కదారి పట్టించటం తప్పు. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయాన్ని కాగ్ ఆడిట్ చేస్తుంది. ఆ ఆడిట్ కి ప్రభుత్వం జవాబు చెప్తుంది. ఒప్పందాల ప్రకారం కంపెనీలు ప్రారంభిచకపోతే ప్రాసెస్ ని ప్రశ్నించాలి. ప్రతి దానిలో అనుమానాలను రాజకీయాలకు లేపుతూ రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నాడు. మరో పక్క అన్నీ అమరావతిలోనేనా అని చెప్పే పవన్, తన ఇల్లు అమరావతిలో కట్టుకుంటున్నాడు, తన ఆఫీస్ అమరావతిలో, చివరకు 2 లక్షల అద్దె ఇల్లు కూడా అమరావతిలోనే తీసుకున్నాడు. ఏ ఉత్తరాంధ్రలో పెట్టవచ్చుగా ?
సరే, ఇదంతా బాగానే ఉంది.. ఉత్తరాంధ్ర బాగుపడాలి అంటే, మనకు విభజన హామీల్లో ఇచ్చిన రెండు అంశాలు ఇప్పటికీ కేంద్రం తేల్చలేదు. కొన్ని దశాబ్దాలుగా రైల్వే జోన్ పై విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి డబ్బులు కూడా ఏమి పెట్టనవసరం లేదు. ఒక నిర్ణయంతో మోడీ, రైల్వే జోన్ ఇవ్వచ్చు. కాని, మనకు ఆదాయం అంతా మన వైజాగ్ కు వస్తుంది కాబాట్టి, మోడీ ఇవ్వటం లేదు. దీని పై ఉత్తరాంధ్ర ప్రజలు, ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. అలాగే, వెనుకబడిన జిల్లాలు అయిన, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, నిధులు ఇస్తాం అని విభజన చట్టంలో పెట్టారు. మొన్న 350కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, చంద్రబాబు ఎదురు తిరిగాడు అని, ఆ 350కోట్లు వెనక్కు తీసుకున్నారు. మరి ఇవి ఉత్తరాంధ్రకు అన్యాయం చెయ్యటం కాదా ? ఇలాంటి నిజమైన సమస్యల పై కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు కాని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పెట్టుబడులు పెట్టి, వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ పై మాత్రం, ఏడుస్తాం అంటే ఎలా పవన్ గారూ ?