జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేస్తారో, ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. తనది కమ్యూనిస్టుల భావజాలమని అనేక సార్లు చెప్పారు. ఇది నమ్మి కమ్యూనిస్ట్ లు దగ్గర అయ్యారు. పవన్ తో కలిసి ఎదో హడావిడి చేస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికల ముందు, ఎదో ఒక పార్టీతో పొత్తు లేనిదే ఈ తోక పార్టీలకు మనుగడ ఉండదు. అందుకే, ఇప్పుడు పవన్ పక్కన చేరారు. కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే పవన్, నరేంద్ర మోడీ అంటే అమితమైన అభిమానం అని, ఆయన నాకు ఆదర్శం అని అనేక సార్లు చెప్పారు. అసలు కమ్యూనిస్టు అనే వాడికి,మోడీపై ఎలా అభిమానం ఉంటుందో అందిరికీ తెలిసిందే. కమ్యూనిస్ట్ లకు, ఈ దేశంలో ప్రధాన శత్రువు మోడీ. మరి మోడీని ఆరాధిస్తున్న పవన్ తో, కమ్యూనిస్ట్ లు వెళ్తున్నారు అంటే, వీళ్ళ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఒక పక్క బీజేపీ పార్టీనే, పవన్ కళ్యాణ్ ను ఆడిస్తుంది అని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నమ్ముతున్నారు. దగా పడ్డ ఆంధ్రుడుకి, విభజన హామీలు నెరవేర్చకుండా, నమ్మించి మోసం చేసాడు మోడీ. ఇలాంటి మోడీ పై, కనీసం ఒక్క మాట కూడా అనకుండా, పవన్ కళ్యాణ్ నాటకాలు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు. 2009 నుంచి, ప్రతి ఎన్నికల్లో ఒక ఆరు నెలలు ముందు రావటం, ఎన్నికలు అయిపోయినాక, త్రివిక్రమ్ తో సినిమాలు తీసుకోవటం, చూస్తూ ఉన్నాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ తో కమ్యూనిస్ట్ లు దోస్తీ చేస్తున్నారు. ఒక పక్క, జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటూ.. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ప్రకటిస్తున్నారు. అయినా సరే, పవన్ తోనే మా పొత్తు అని కమ్యూనిస్ట్ లు అంటున్నారు. దీని పై ఇప్పటి వరకు, పవన్ ఏ మాట చెప్పకపోయినా, వీళ్ళు మాత్రం, పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు.
ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, భజన కార్యక్రమం చేసారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, మహా కూటమి ఏర్పడితే సీఎం అభ్యర్థి ఆయనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజల్లో పవన్‌కు ఇమేజ్, క్రేజ్ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాజకీయంగా మంచి పరిణతి ఉందని, ఇలాంటి నాయుకులు అసలు ఆంధ్రప్రదేశ్ లేరని కొనియాడారు. అందుకే మా కూటమికి పవన్ ముఖ్యామంత్రి అభ్యర్ధి అని, చెప్పారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష, జనసేన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌కల్యాణ్ అని, మేము అధికారంలోకి వస్తాం అంటూ చెప్పుకొచ్చారు.