విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి అన్నారు. హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదన్నారు. ఇది సన్మాన సభ కాదని.. హోంగార్డుల చైతన్య సభ అని పేర్కొన్నారు. కేంద్ర సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదట హోంగార్డులనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలసి సీఎం పోలీసుశాఖకు సూచించారు. లాక్డ్ హౌస్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు.

homegaurds 02072018 1

1948లో ఆంధ్రప్రదేశ్ హోం గార్డ్ చట్టం రూపకల్పన చేశారు. పోలీసులతో సమానంగా ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల, ట్రాఫిక్ విధుల్లో, నేరపరిశోధన పనుల్లో, బీటు డ్యూటీ సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ వ్యవస్థ ఏర్పడి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం మేలు చెయ్యని విధంగా ఈ వ్యవస్థ కు గౌరవం, గుర్తింపు తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు రోజువారి అందించే దినసరి భత్యాన్ని రూ.400 నుంచి రూ.600 పెంచుతూ నెలకు రూ.9000 ఉన్న జీతాన్ని రూ.18000 జీతం చెల్లింపుకు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి గరిష్టంగా రూ.2,50,000 వైద్య సేవలు కల్పిస్తున్నారు. హోం గార్డ్ మరణించిన సమయంలో ఇచ్చే సహాయాన్ని రూ.1000 నుంచి రూ.10 వేలకు పెంచారు.

homegaurds 02072018 1

ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం గాని సంభవిస్తే రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల రెండు రోజులు జీతం తో కూడిన సెలవు మంజురూ చెయ్యడం జరిగింది. రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డు లు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ నియామకంలో హోంగార్డు లకు 8 శాతం కోటాను అమలుచేస్తున్నారు. మహిళా హోంగార్డు లకు మూడు నెలల ప్రసూతి సెలవులు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొదట హోంగార్డులనే ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read