ఒక శాఖ సమీక్షకు ముందు డేటా రావల్సి ఉంటుంది. అది ఉంటేనే సమీక్ష. లేకపోతే లేదు. అది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు చంద్రబాబు నాయుడు. అధికారుల కంటే ముందే తన ట్యాబ్‌లో సమాచారం సిద్ధంగా ఉంచుకుంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు మీరుతున్నకొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. సర్కారు శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక్క నిమిషంలో తెలుసుకునేందుకు రూపొందించుకున్న డ్యాష్‌బోర్డు ఇప్పుడు అధికారులను హడలెత్తిస్తోంది. ఇది ఇలా ఉండగా, తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు ఐటి శాఖా మంత్రి నారా లోకేష్. తన శాఖకు ప్రత్యేకంగా ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసారు. ఏ మంత్రికి లేని విధంగా, తన శాఖకు ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసారు. http://www.mydepartments.in/PRRWS/ministerHomePage
ఈ డ్యాష్‌బోర్డు ఒక్క క్లిక్‌ద్వారా పారదర్శకతను ఆవిష్కరిస్తోంది. పంచాయితీ రాజ్, ఐటి శాఖలకు చెందిన సమగ్ర సమాచారం ఇందులో అందుబాటులో ఉంచారు. డ్యాష్‌బోర్డు లో తన మంత్రిత్వశాఖ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, తన మంత్రిత్వ శాఖ పెట్టే ప్రతి ఖర్చు, వివిధ జీఓలతో పాటు, అనేక గణాంకాలు ఉన్నాయి. పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు ఐటి ఇ & సి కి సంబంధించిన వివిధ సెక్షన్స్ ఈ డ్యాష్‌బోర్డులో ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో, ఉపాధి హామీ కూలీల వివరాలు, ఎన్టీఆర్ జలసిరి, తదితర వివరాలు రియల్ టైంలో అందుబాటులో ఉంటాయి.
ఇక గ్రామీణ నీటి సరఫరాలో, నీళ్ళ టాంకర్ల వివరాలు, ఆ టాంకర్ ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా కనిపెట్టటం, ఇలా పూర్తి వివరాలు, గ్రామ స్థాయి వరకు ఉన్నాయి. ఎన్టీఆర్ సుజల, జాలవని, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, నీటి సరఫరా, ఇలా పూర్తి సమాచారం రియల్ టైంలో ఉంది. ఇక ఐటి శాఖ పేజికు వస్తే, పెట్టుబడుల వివరాలు, ఈ ఆఫీస్, ఫైబర్ గ్రిడ్, ఇలా అనేక వివరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎదో పెట్టాం అంటే పెట్టాం అన్నట్టు కాకుండా, పూర్తి వివరాలు ఉన్నాయి. ఎక్కడా పారదర్సకత లోపించకుండా, గ్రామ స్థాయి వరకు ఇందులో వివరాలు ఉన్నాయి. ప్రస్తుత్తం ఉంటున్న సియం డ్యాష్‌బోర్డులో దాదాపు 33 శాఖలకు సంబందించిన వివరాలు ఉన్నాయి. అయితే, అందులో ఆ శాఖలకు సంబంధించిన అతి ముఖ్యమైన పనులు వివరాలు ఉంటాయి. ఇప్పుడు లోకేష్ తన శాఖకు ప్రత్యెక డ్యాష్‌బోర్డు పెట్టటంతో, తన శాఖ పరిధిలో, ప్రతి విషయం రియల్ టైంలో ప్రజల ముందు ఉంచుతున్నారు.