బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియా దిగ్గజం రామోజీ రావును కలిశారు. శుక్రవారం తెలంగాణకు పర్యటనకు వచ్చిన అమిత్ షా.. బీజేపీ నాయకులతో సమావేశం అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీ రావును ఆయన నివాసంలో కలిశారు. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ఆయన రామోజీతో భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కారు గత నాలుగేళ్లుగా సాధించిన విజయాల గురించి వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాలు, సాధించిన విజయాలతో రూపొందించిన బుక్‌లెట్లను రామోజీకి అందజేశారు. ఆయనతో కాసేపు పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం మాత్రం చంద్రబాబే అనే సమాచారం వస్తుంది.

amtishah 15072018 2

చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ - అమిత్ షా గ్రాఫ్ పడిపోవటం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మోడీని ఎండగట్టటం, తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చించకుండా మోడీ పారిపోవటం, దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకం చెయ్యటం, కర్ణాటకలో బీజేపీ ఓటమికి చంద్రబాబు పిలుపు ఇవ్వటం, తారువాత అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వేదిక పంచుకోవటం, ఇవన్నీ బీజేపీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. చంద్రబాబు లాంటి నమ్మకమైన మిత్రపక్షం దూరం జరిగిందని, ఎన్డీఏ బలహీనపడుతుంది అనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. దానికి తోడు, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారింది.

amtishah 15072018 3

మమతా బనర్జీ, మాయావతి లాంటి నేతలు తృతీయ ప్రత్యామ్నయం అని ఎప్పటి నుంచో అంటున్నా, చంద్రబాబు వస్తున్నారు అనేసరికి చాలా ప్రాంతీయ పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే, బీజేపీ దీనికి కౌంటర్ మొదలు పెట్టింది. రామోజీతో జరిగిన సమావేశంలో, ఇదే విషయం ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పుడన్న పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ కి రారు అని అర్ధమువుతుంది, అయితే ఆయన్ను తృతీయ కూటమి వైపు వెళ్ళకుండా, మా పై విమర్శలు తగ్గించమనండి, ఉన్న పరిధుల్లో రాష్ట్రానికి చెయ్యాల్సినవి చేస్తాం అని చెప్పినట్టు సమాచారం. తద్వారా, కాంగ్రెస్ బలపడటం కాని, తృతీయ కూటమి ఏర్పడటం కాని జరగదని బీజేపీ లెక్క. మొన్న గడ్కరీ కూడా ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని ప్రచారం జరుగుతుంది. దేశ శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ రాకుండా, చూడాల్సిన బాధ్యత మీ పై కూడా ఉంది అని గడ్కరీ చంద్రబాబుతో చెప్పినట్టు సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో రామోజీ నడవిక చూస్తుంటే, బీజేపీకి చాలా దగ్గరైనట్టు తెలుస్తుంది. ఇది వరకు లాగా, చంద్రబాబుకు, రామోజీకి సంబంధాలు లేవనే ప్రచారం కూడా ఉంది. మరి రామోజీ, చంద్రబాబుకు చెప్తారా ? చెప్పినా చంద్రబాబు వింటారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read