వారే కొడతారు... ఎదురు వారే రాష్ట్రంలో శాంతిబధ్రతలు లేవు అంటారు. ఇదే బీజేపీ తాజా వ్యూహం. ఇదే వ్యూహంతో భావోద్వేగాలు రెచ్చగొట్టి, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. ఇప్పుడు ఇదే వ్యూహం మన రాష్ట్రంలో అమలు చేయ్యనుంది. ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లి, హోం మంత్రిని కలిసి, రాష్ట్రంలో శాంతిబధ్రతలు ఆర్డర్ లో లేవని, అందరి పైనా దాడులు జరుగుతున్నాయని, ప్రజలు బ్రతకలేకపోతున్నారని ఫిర్యాదు చేసారు. మొన్న గవర్నర్ కు ఫిర్యాదు చేసి, రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఏపిలో బీజేపీ వ్యూహం మార్చిందని, కేంద్రం ఇదే చేస్తుంది, అది చేస్తుంది అంటే ప్రజలు నమ్మటం లేదు కాబాట్టి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని లబ్ది పొందటానికి ప్లాన్ వేసింది బీజేపీ.

kanna 16072018 2

ప్రతిఘటన ఎదురు కాక ముందే బీజేపీ నేతలు దూసుకెళ్తున్నారు. వ్యతిరేకంగా నినాదాలు వినిపించకముందే విరుచుకుపడుతున్నారు. ఒంగోలు నుంచి కావలి వరకు అదే జరిగింది. ఒంగోలులో ప్రత్యేకహోదా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిపై బీజేపీ నేతలు దాడి చేయడం కలకలం రేపుతోంది. శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు తరిమి తరిమికొట్టారు. కింద పడేసి కాళ్లతో తొక్కారు. సాధారణంగా ఏ పార్టీ సమావేశంలో అయినా ఇతరులు గలాటా చేస్తే దాడులు చేయడం అరుదు. ఎందుకంటే దాడి అంటూ జరిగితే సమావేశం రసాబాస అవుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ కార్యక్రమం ఏమైపోయినా పర్వాలేదు, దాడుల విషయానికి మైలేజీ వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కన్నా పర్యటనలో వెలుగు చూసిన దాడుల వ్యవహారాల్లో ఇదే కీలకంగా మారుతోంది. ఈ దాడుల వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

kanna 16072018 3

భారతీయ జనతా పార్టీ తమకు ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు చేసే రాజకీయం ఇప్పుడు ఏపీలో కూడా ప్రారభించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్, కరేళల్లో బీజేపీకి ఒకప్పుడు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. కానీ ఇప్పుడు కొంత మేర బలపడింది. దీని వెనుక అసలు కారణం ఎప్పటికప్పుడు... తమ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలపై దాడులు, ప్రతి దాడుల వ్యవహారాలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం. రాజకీయం, ప్రజాసంక్షేమం కన్నా ఇతర భావోద్వేగ అంశాలతోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఎగ్రెసివ్‌గా వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులకు ఆ పార్టీ శ్రేణులు పాల్పడుతూంటారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ విభజన హామీల ఉద్యమకారులపై ప్రయోగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతుతున్నాయి. దాడులు చేస్తోంది బీజేపీ నేతలు అయితే టీడీపీ పనేనంటూ ఆరోపిస్తూ నేరుగా గవర్నర్‌కు, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్లు కూడా చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న దాడులు వారి ఫిర్యాదుల వెనుక అసలు లక్ష్యం మాత్రం కేరళ, బెంగాల్ తరహా రాజకీయమేనని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read