హోమ్ గార్డులకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామ రెవిన్యూ సహాయకులు, ఆశా కార్యకర్తలకు, ఇలా అన్ని వర్గాలకు గుడ్ న్యూస్ వినిపిస్తున్న చంద్రబాబు, ఇప్పుడు 54 వేల మంది ఆర్టీసీ కార్మికులకు మంచి కబురు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఇంటరిమ్ రిలీఫ్ (ఐ.ఆర్)ను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. రాష్ట్రంలో గల 54 వేల మంది ఆర్.టి.సి ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఐ.ఆర్ ప్రకటించడం వల ప్రభుత్వంపై ఏడాదికి రూ.249 కోట్లు ఆర్ధిక భారం పడనుందని మంత్రి చెప్పారు. దేశంలో అత్యుత్తమ సంస్ధగా ఏపి ఎస్.ఆర్.టి.సి మనుగడ సాగిస్తుందోని మంత్రి ప్రకటించారు. యాజమాన్యం, కార్మికులు కలసి పనిచేసినపుడే సంస్ధ బాగుంటుందని, ప్రజలకు మంచి సేవలు అందుతాయని మంత్రి అన్నారు.

rtc 15072018 2

రాష్ట్ర విభజన అనంతరం ఏపిఎస్.ఆర్.టి.సి ఇబ్బందుల్లో పడిందని, అనేక సమస్యలు ఎదుర్కొందని ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఆర్.టి.సి ఉద్యోగులు సంఘటితంగా పనిచేయడం జరిగిందని ఆయన అన్నారు. సంస్ధ బలోపితానికి అందరూ సమష్టిగా కృషి చేసారని ఆయన అభిందించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం ద్వారా సంస్ధ మరింత బలోపితం అవుతుందనే విశ్వాసంతో ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం కష్ట కాలంలో ఉన్నప్పటికి గత పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సి) లో రాష్ట్ర ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించామని చెప్పారు. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుండి మరో పి.ఆర్.సి అమలు చేయాల్సి ఉందని దీనికై కమీషన్ ను నియమించామని చెప్పారు.

rtc 15072018 3

పి.ఆర్.సి కమీషన్ నివేదిక సమర్పించేటప్పటికి కొంత సమయం పడుతుందని, నివేదిక అందే వరకు ఆర్.టి.సి ఉద్యోగులకు 19 శాతం ఐ.ఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని మంత్రి చెప్పారు. ఇది శుభ పరిణామమని అన్నారు. ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలనేది సీఎం ఆశయమన్నారు. అందుకే ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే బాగా పని చేసి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తుందని నమ్మే వ్యక్తి సీఎం అన్నారు. ఆర్ధిక పరిస్ధితులు అనుకూలంగా లేనప్పటికి హోమ్ గార్డులకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామ రెవిన్యూ సహాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులకు వేతనాలు పెంపుదల చేసారని మంత్రి వివరించారు. ఆర్.టి.సి ఉద్యోగులకు ప్రకటించిన ఐ.ఆర్ ఉత్తర్వులు తక్షణం విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read