కాపు రిజర్వేషన్ సెగ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాకింది. మొన్నటి వరకు కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు ప్రభుత్వం పై, విమర్శలు చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని పంపించారో, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ పై అసలు మాట మాట్లాడటం లేదు. కేంద్రం కోర్ట్ లో కాపు రిజర్వేషన్ ఉంది కాబట్టి, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ గురించి ఒక్క మాట మాట్లాడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు నిందించాల్సింది కేంద్రాన్ని. మోడీ, అమిత్ షా ని ఒక్క మాట అనే సాహసం జగన్ చెయ్యలేడు. అయితే, ఇప్పుడు జగన్ తూర్పు గోదావరిలో పాదయాత్ర చెయ్యటం, కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో, అక్కడి వైసీపీ నేతలు, ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ పై మాట్లాడమని అడుగుతున్నారు.
కాకినాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో జాబితాలో చేర్చే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీలో కాపు సామాజిక వర్గ నేతలు జగన్‌పైనా, పార్టీ కీలక నాయకులపైనా ఒత్తిడి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌తోపాటు.. వైసీపీ అధికారంలోకి వస్తే కాపులకు ఉపముఖ్యమంత్రితో పాటు.. ఇతర ఏఏ కీలక పదవులు ఇస్తారనే అంశంపైనా ప్రకటన చేయాలని జగన్‌ని పట్టుపడుతున్నారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. దీంతోపాటు.. టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా కాపులకు ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి పదవిని కోనసీమ వాసి నిమ్మకాయల చినరాజప్పకు కట్టబెట్టారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అం శంపై ఇప్పటికీ చిత్తశుద్ధితో ఉన్నట్టు సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌తో కూడా కాపులకు సంబంధించి హామీ ఇప్పించకపోతే ఆ సామాజిక వర్గంలో పార్టీ వెనుకబడుతుందన్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ కాపు నేతలు పట్టుదలతో ఉన్నారు.
ఎట్టి పరిస్థితులలోనూ కాపులకు వైసీపీలో ఇవ్వబోయే ప్రాధాన్యంపైనా జగన్‌తోనే ప్రకటన చేయిస్తామని కాపు యువతకు ఆ సామాజిక వర్గ వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ కాకినాడ బహిరంగ సభలో ప్రకటించేలా జగన్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్టు కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే సమయానికి కాపులకు వైసీపీలో ఇచ్చే ప్రాధాన్యత, బీసీ జాబితాలో చేరుస్తామన్న హామీ వంటి కీలక ప్రకటనలు జగన్ చెయ్యాలని, నేతలు ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి పశ్చిమ గోదావరిలో ఎంటర్ అయ్యి, దాదాపు ఇప్పటికి నెల రోజుల పైనే అయ్యింది. అప్పటి నంచి, వైసిపీ కాపు నేతలు, కాపు రిజర్వేషన్ పై, ప్రతి మీటింగ్ లో మాట్లాడాలని కోరినా, జగన్ మాత్రం వినలేదు. కనీసం తూర్పు గోదావరి పాదయత్ర ముగిసే లోపు ఒక్క మాట అయినా చెప్పాలని, అప్పుడే ప్రజల మధ్య తల ఎత్తుకోగలం అని అంటున్నా, జగన్ మాత్రం వినటం లేదు.