ఏపీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ తన వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రం సాయంతో నడుస్తున్న పథకాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ తమ పథకాలుగా ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ అవి కేంద్ర పథకాలని ప్రకటించి ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా పధకాలపై బీజేపీ ముద్ర ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తాజా వ్యూహానికి తెలుగుదేశం కూడా కౌంటర్ సిద్దం చేసింది. పోలవరానికి వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి సోమవారం సమీక్షిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందనే ప్రచారాన్ని తెలుగుదేశం ప్రజల్లోకి తీసుకువెళ్లిందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నిర్మాణం పరుగులు తీస్తోందని ప్రజలు కూడా నమ్ముతున్నారు.

bjp 15072018 2

అందుకే, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పది నెలల తర్వాత పోలవరం వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షించారు. గడ్కరీ వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు కూడా హడావుడి సృష్టించారు. గడ్కరీ కూడా, ఈ ప్రాజెక్ట్ మోడీ వల్లే అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరో పక్క, ఈనెల 13వ తేదీన మంగళగిరికి సమీపంలో నిర్మిస్తున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రి నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా కూడా వచ్చారు. ఎయిమ్స్ నిర్మాణ పురోగతి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం, విభజన చట్టంలో కేంద్రం ఎయిమ్స్ నిర్మిస్తామని ఇచ్చిన హామీని ప్రజలకు గుర్తు చేసారు. ఈ నెలలోనే, కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చి, రాష్ట్రంలో ఏర్పాటైన, వివిధ కేంద్ర విద్యా సంస్థలు పరిశీలించి, ఇదంతా మోడీ చలవే అని చెప్పనున్నారు.

bjp 15072018 3

ఈ విధంగా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి తీసుకువస్తుండటంతో తెలుగుదేశం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అత్యంత విలువైన సుమారు వంద ఎకరాల స్థలం ఇచ్చిన విషయం నీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అలాగే, పోలవరం గురించి, ఇప్పటికే కేంద్రం అడుగడుగునా ఎలా కొర్రీలు పెడుతుంది ప్రజలకు చెప్తున్నారు. మరో పక్క కేంద్ర విద్యా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖరీదైన భూములు ఇచ్చింది, ప్రహరీలు కట్టింది, మౌలిక సదుపాయలు ఇచ్చింది చెప్పి, కేంద్రం వీటికి ఇప్పటికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఇవి పుర్తవ్వాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ప్రజలకు వివరిస్తారు. అలాగే, కేంద్రం మనకు వేసే బిక్ష ఏమి ఉండదు అని, రాష్ట్రాలు ఇచ్చిన డబ్బులే, కేంద్రం తిరిగి రాష్ట్రాలుకు ఇస్తుందనే విషయం బీజేపీ మర్చిపోతుందని, ఈ విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రం నుంచి రూపాయి వెళ్తుంటే, తరిగి 37 పైసలు మాత్రమే వస్తుందని, మిగతా 63 పైసలు కేంద్రం వాడుకుంటుందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన మిగతా హామీలను నెరవేర్చకుండా ఎవరు వచ్చి ఏం చేసినా ఉపయోగం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read