Sidebar

04
Sun, May

చంద్రబాబు 1995లో తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒకటి చెప్తూ ఉంటారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే చెయ్యాలి, మిగతా సమయంలో రాష్ట్రం కోసం పని చెయ్యాలి అని. అప్పటి నుంచి ఆయన అదే పాటిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా అదే చేసారు. గత నాలుగేళ్ళుగా అదే చేస్తున్నారు. అమరావతి, పోలవరం, అభివృద్ధి, సంక్షేమం అనే పిచ్చలోనే ఉన్నారు. రాష్ట్రానికి, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోరాటం చేస్తున్నారు. అయితే, ఇటు, జగన్, పవన్, బీజేపీ మాత్రం, పోయిన ఏడు నుంచి రాజకీయాలు తీవ్ర స్థాయిలో మొదలు పెట్టారు. ఇంకా ఏడాదిన్నర కాలం మిగిలి ఉండగానే, ప్రభుత్వం పై పోరాటాలు చెయ్యకుండా, ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు. చివరకు ప్రతిపక్షం అసెంబ్లీకి రావటం కూడా మానేసింది. అయినా, చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం వదిలిపెట్టకుండా, ఆయన ఫ్లో లో ఆయన వెళ్ళిపోతున్నారు.

cbnstep 080872018 2

అయితే, జగన్, పవన్, బీజేపీ కుట్రలు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, తెలంగాణా వాదం ఎలా అయితే రేపాడో, అలా పవన్ చేత, జగన్ చేత, డ్రామాలు ఆడిస్తుంది బీజేపీ. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వీటిని తిప్పికొడుతున్నా, సరైన రీతిలో వీరిని అనిచేయ్యటం లేదు. దీంతో ఎన్నికలు సంవత్సరం పాటు ఉన్నా, ఇప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాలకే కేటాయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీని పై అధికారులకు కూడా సంకేతాలు ఇచ్చారు. రోజువారీ పాలనా కార్యక్రమాల బాధ్యత ఇక మీరే చూసుకోవాలి. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి ఒకటి, రెండు అంశాలు మాత్రమే నేను పర్యవేక్షిస్తా అని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది.

cbnstep 080872018 3

జగన్, పవన్, బీజేపీ చేస్తున్న దాడిని, సీనియర్‌ నాయకుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ఈ దాడిని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని, స్థానిక నేతల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని చంద్రబాబుకు ఫీడ్ బ్యాక్ రావటంతో, ఇక ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. రాజకీయాలపై దృష్టిపెట్టడంతో పాటు, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలను మరింత ముమ్మరం చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. జగన్, పవన్, బీజేపీ, ఇలా మూడు పార్టీలకు చెక్ పెట్టేందుకు, ఒక్కో పార్టీకి, ఒక్కో ప్లాన్ రెడీ చేస్తున్నారు. అలాగే, ముగ్గురూ కలిసిపోయిన విషయం, ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళినా, అది మరింత బలపడేలా ప్రచారం చెయ్యనున్నారు. ఇదే కాకుండా, ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నా, అవి ప్రజల్లోకి వెళ్ళటం లేదు అని అభిప్రాయం కూడా ఉంది. అందుకే, ఈ విషయం పై కూడా, ఆయన ద్రుష్టి పెట్టి, చేసిన మంచి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. ఇక చంద్రబాబు ఫుల్ టైం రంగంలోకి దిగితే, పవన్, జగన్, తోకలు కత్తిరించి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టటం ఖాయం అని, తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వీరిని చూసి చూడనట్టు వదిలేసి, ఇక్కడ వరకు తెచ్చుకున్నామని, ఇక కౌంటర్ ప్లాన్ తో, వీరి ముగ్గురికీ చెక్ పెట్టాలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read