ఆయన రాజకీయం జీవితం 40 ఏళ్ళు. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చరిత్ర ఆయనది. అత్యంత చిన్న వయసులో మంత్రి అయిన రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రికార్డు. నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి, ప్రాధానులని, రాష్ట్రపతులని నిర్ణయించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ జోడించి, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. తెలంగాణా గుండెకాయ, సైబరాబాద్ సిటీ సృష్టికర్త. ఆయనకు ఉన్న బ్రాండ్ వేల్యూతో, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టిన చరిత్ర. ఆయనే చంద్రబాబు. చంద్రబాబు అంటే గుర్తుకువచ్చేది సమర్ధవంతమైన అడ్మినిస్ట్రేషన్... చంద్రబాబు బద్ధ వ్యతిరేకులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఇలాంటి చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ ఒక సవాల్ విసిరారు.
కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు, మాట్లాడుతున్న మాటలకు, సహజంగానే రాజకీయంగా, తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కనీస అవగాహన కూడా లేకుండా, పవన్ కళ్యాణ్ ఎలా అభాసుపాలవుతున్నారో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. నీకు అవగాహన లేదు అని పవన్ పై విమర్శలు చేసినందుకు, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సవాల్ విసిరారు. నేను మీలాగా ఐఏఎస్ ఆఫీసర్ల పై ఆధారపడి లేను, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా చదువుకున్నాను, ప్రతి రోజు 10 గంటలు అన్నీ చదువుతూనే ఉంటాను, వైద్య, న్యూక్లియర్, వాతావరణ, వ్యవసాయం, మైనింగ్, పంచాయతీరాజ్ ఇలా దేనిపైనైనా నేను ఒక్కడినే వచ్చి, మాట్లాడతాను, మీరు ఐఏఎస్ ఆఫీసర్ల సాయం లేకుండా, నాతో చర్చకు రండి అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక్కరే కాదు, లోకేష్, జగన్ కు కూడా సవాల్ విసిరారు.
నాకు ఏ పాలసీ అయినా తెలుసు, నాకు ముందు చూపు ఎక్కువ, మీకు 2050లో విజన్ డాక్యుమెంట్ లో, వైజాగ్ ఎలా ఉండాలో చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు కావలి, కాని నేను ఒక్కడినే చెప్పగలను, అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేసాడు పవన్. ఏ టాపిక్ అయినా, ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏదైనా, నేను మీతో చర్చకు రెడీ అంటూ, సవాల్ చేసాడు. అయితే, దీని పై ప్రజలు పడి పడి నవ్వుకుంటున్నారు. గత రెండేళ్ళ నుంచి మిస్సోరీలో ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తయిన సందర్భంలో, మీకు ఎవరి స్పీచ్ వినాలని ఉంది అంటే, చంద్రబాబు పేరు చెప్పారు. అది చంద్రబాబు సత్తా. సెంట్రల్ సర్వీసెస్ నుంచి, చంద్రబాబు వద్ద పని చెయ్యటానికి, ఐఏఎస్ లు ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు దగ్గర పని చేస్తే, మా కెరీర్ కు ఎంతో ఉపయోగం అని ఐఏఎస్ లు నమ్ముతూ ఉంటారు. అలాంటి చంద్రబాబుకు, అడ్మినిస్ట్రేషన్ లో, పాలసీల్లో , మీరు ఐఏఎస్ ఆఫీసర్ల సహాయం లేకుండా, నాతో చర్చకు రండి అని పవన్ సవాల్ విసిరుతుంటే, "డిక్కీ బలిసిన కోడి, చికెన్ షాప్ ముందుకు వచ్చి తోడ కొట్టింది అంట" అనే మహేష్ బాబు సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తుంది.