మన రాష్ట్రంలో విద్యార్ధులకు, అమెరికాలో చదువుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. అక్కడ మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చెయ్యాలని, అక్కడ మంచి ఉద్యోగం చెయ్యాలని, ఇలా అనేక కలలు కంటూ ఉంటారు. కాని, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మధ్య తరగతి కుటుంబాలకు, ఎంతో భారం. ఇవన్నీ చూసిన చంద్రబాబు, కొన్ని కార్పొరేషన్ల ద్వారా, కొంత మంది విద్యార్ధులకు ఫీజ్ లు కట్టి, విదేశాల్లో చదివిస్తున్నారు. అయితే, ఇది కొంత మందికి మాత్రమే వీలు ఉంటుంది. దీన్ని కూడా అధిగమించి, తల్లి తండ్రుల పై భారం తగ్గించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న అడుగు వేసింది. అమెరికాలోని ఒహోయో రాష్ట్రంతో, కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి 75 శాతం ఫీజ్ రాయతీ ఇస్తారు.
అంటే, ఇప్పుడు అక్కడ ఫీజ్ 20 లక్షలు ఉంటే, 15 లక్షలు రాయతీ వస్తుంది. విధ్యార్ధులు 5 లక్షలు కడితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న 272 యూనివర్సిటీలలో, ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీజ్ రాయతీ, ఎంఎస్ కోర్స్ కు మాత్రమే ఉంది. మిగిలిన కోర్స్ లకు కూడా, త్వరలోనే, ఈ ఒప్పందంలో చేర్చనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో సెమిస్టర్ కు, ఒక్కో విద్యార్ధికి 4 లక్షల వరకు అదా అవుతుంది. ఈ ఫీజ్ రాయతీ పొందటానికి, ముందుగా ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖకు ధరఖాస్తు చేసుకోవాలి, తరువాత అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా స్క్రీనింగ్ చేసి, విధ్యార్ధులను తమ యూనివర్సిటీలలో చేర్చుకుంటాయి.
ఈ వివరాలు అన్నీ గంటా శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. త్వరలోనే, అమెరికాలోని మరిన్ని రాష్ట్రాలతో కూడా ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. అలాగే చైనా, కెనడా, యుకే తో కూడా, ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటామని, ఆ చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. అందరూ మంచి చదువు, చదువుకోవాలనే ముఖ్యమంత్రి సంకల్పం కోసం, విద్యా శాఖ కృషి చేస్తుందని చెప్పారు. అలాగే, అమరావతి, వైజాగ్, తిరుపతిలో, ప్రముఖ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా కృషి జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ ని అప్గ్రేడ్ చెయ్యటం మొదలు పెట్టామని, అన్ని స్కూల్స్ లో, అన్ని రకాల ఆధునిక వసతలు కలిపిస్తున్నామని చెప్పారు.