రాష్టవ్య్రాప్తంగా రైతుబజార్లలోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌పర్ట్ 365 అనే సంస్థ ముందుకొచ్చింది. శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్గానిక్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 31 గంటల్లోనే కూరగాయల వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువులు తయారు చేసే వీలు కలుగుతుంది. 300 కిలోల పళ్లు, కూరగాయలు, ఇతర వ్యర్థాలతో 50కిలోల సేంద్రియ ఎరువులు తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈనెల 18న పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరు, విజయవాడ రైతుబజార్లలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.

australi 14072018 2

ఒక్కో ప్లాంట్ వారానికి రెండుటన్నుల వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తుంది. ‘చంద్రన్న రైతు సమృద్ధి’ పేరుతో అందుబాటు ధరలో ఆర్గానిక్ కంపోస్టును రైతులకు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరో పక్క, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలు, పండ్లు రైతులే నేరుగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు 75 శాతం సబ్సిడీపై వాహనాలను ప్రభుత్వం అందిస్తోంది. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఈ రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉద్యానవన పంటల పెంపకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

australi 14072018 3

రాష్ట్రంలోని కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు లక్ష్యంగా చెప్పారు. సేంద్రియ ఎరువులతో పంటలు పండించటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, ఆదాయం పొందాలన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘానికి రెండు వాహనాలను అందించారు. ఈ వాహనాల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు నిల్వచేస్తారు. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఉద్యానవన పంటలలో సేంద్రియ వ్యవసాయానికి మంచి ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సబ్సిడీపై ఈ వాహనాలను ప్రభుత్వం అందజేయటం వల్ల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌లో అమ్ముకో గలుగుతున్నామని, మార్కెట్ ధరకంటే అదనపుధర వస్తోందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి బి రాజశేఖర్, ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read