నరేంద్ర మోడీ అంటే చాలు, వైసీపీ వణికిపోతుంది. ఆయన ఏమి చెప్పినా, వినాల్సిన పరిస్థితి పాపం. అంతలా బుక్ అయ్యారు. రాష్ట్ర సమస్యలే గాలికి వదిలేసి, మోడీకి సరెండర్ అయిన వైసిపీ, మోడీకి జీ హుజూర్ అంటుంది. మోడీకి, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తద్వారా తమకు ఢిల్లీలో లాభం అని జమిలీ ఎన్నికలకు ప్లాన్ వేసారు. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా, లా కమిషన్, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. రెండు రోజుల పాటు లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో.. బీజేపీకి సన్నిహితంగా ఉండే నాలుగు పార్టీలు మాత్రమే.. జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి. తొమ్మిది పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.

jagan 10072018 2

కేవలం సమాజ్‌ వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, అకాలీదళ్‌, అన్నాడీఎంకేలు మాత్రమే మోదీ నిర్ణయానికి ఒకే అన్నారు. ఇందులో, అన్నాడీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు బీజేపీకి ఇప్పటికే లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, వీరికంటే ముందే మోడీకి లొంగిపోయిన జగన్ పార్టీ, ఈ రోజు మోడీకి సై అంటుంది. మోడీ నిర్ణయమే, మా పార్టీ నిర్ణయం అని, మంగళవారం మధ్యాహ్నం ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. లా కమిషన్‌ను కలిసి చెప్పారు. మా సంపూర్ణ మద్దతు ప్రధాని మోడీకి ఉంటుంది అని, వారు లా కమిషన్‌కు తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి లేఖను లా కమిషన్‌కు అందజేశారు.

jagan 10072018 3

లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదన కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే, కేవలం మోడీకి అనుకూలంగా ఉన్న నాలుగు, అయిదు పార్టీలు మాత్రమే మద్దతు తెలిపాయి. మరి కొన్ని పార్టీలు మద్దతు ఇస్తే, వీరు చేసే వాదనకు బలం ఉంటుందని భావించి, అమిత్ షా, అనుకూలంగా లెటర్ ఇవ్వమని కోరటంతో, హుటా హుటిన, విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లి, మోడీకి మద్దతుగా లెటర్ ఇచ్చి వచ్చారు. మరో పక్క, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, మేము జమిలీ ఎన్నికలకు ఒప్పుకోమని, ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలు తేల్చకుండా, ఇలాంటి ఎన్నికల స్టంట్ లకు లొంగేది లేదని, ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే, జగన్ పార్టీ మాత్రం, మోడీ ఏది చెప్పినా, మాకు సమ్మతమే అని చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read