ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల మూడో వారంలో సొంతగూటిలో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చినా, కిరణ్ చేరిక ఇంకా లేట్ అవుతునట్టు తెలుస్తుంది. పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ,రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయన త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని, ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని ఎఐసిసి వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కిరణ్‌కి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, ఈ తరహా వార్తలు న్యూస్‌ ఛానళ్లలో చూస్తున్నాని అంటున్నా, ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

kiran 10072018 2

తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా వున్న పలువురు నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి తనతో పాటు తిరిగి పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ జవసత్వాలు కూడదీసుకునేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన తర్వాత పార్టీని విడిచిపెట్టిన నాయకులందరినీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధిష్థానం రంగంలోకి దిగింది.నర్సీపట్నం మాజీ ఎంఎల్‌ఎ బోళెం ముత్యాలపాప, జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, తదితర మాజీ నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి కాంగ్రె్‌సలో తిరిగి చేరుతున్నట్టు చెప్పడమే కాకుండా వారిని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే అలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పినట్టు మాజీ ఎంఎల్‌ఏ ముత్యాలపాప తెలిపారు.

kiran 10072018 3

మరో పక్క జగన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా, కిరణ్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తో పోసగాలేక, అటు చంద్రబాబు దగ్గరకు వెళ్లలేక ఉన్న వారిని, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, నెల్లూరులో సీనియర్ అయిన ఆనం రాంనారయణ రెడ్డిని కూడా, కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించారు. ఇప్పటికే ఆనం, జగన్ తో వెళ్దామని డిసైడ్ అయినా, ఎమ్మల్యే టికెట్ విషయంలో, తేడా వచ్చి ప్రస్తుతానికి ఆగిపోయారు. ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా జగన్ జైలుకు వెళ్ళాల్సిందే అని, అలాంటి పార్టీలో ఉండటం కంటే, కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే మేలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read