ఈనెల 11న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌గడ్కరీకి సర్వం పక్కా ఆధారాలతో వివరించి, నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి, పోలవరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగు తున్న పనులన్నింటిని మంత్రి పరిశీలించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రాజెక్టు పనులపై పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు జలవనరుల శాఖాధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.అంతేకాకుండా నితిన్‌ గడ్కరీ కి ఇప్పటివరకు పనుల పురోగతిపై ఒక నివేదికను సమర్పించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఈ నివేదికలో ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతి, ఏఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టిందీ, ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నాయో వాటి గురించే కాకుండా ఇంకా కేంద్రం నుంచి వచ్చిన, రావాల్సిన నిధులతో కూడిన వివరాలతో నివేదికను గడ్కరీకి అందజేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సమస్తం రడీ అయ్యారు.

gadkari10072018 2

కేంద్రమంత్రికి సర్వం తెలిసేలా నివేదిక ఉండాలని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖాధికారులను ఆదేశించడంతో ఆ మేరకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంటుంది . ఇటీవల గడ్కరీ నేరుగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఫోన్‌ కాల్‌ చేసి, తాను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న సంగతిని తెలిపిన సంగతి తెలిసిందే. 11వ తేదీన గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు.ఈ సందర్బంగా ఆయన పోలవరం ప్రాజెక్టును మొత్తం కలియ తిరిగి,ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు.అక్కడే అధికారులతో ముఖ్య మంత్రితో కలిసి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.

gadkari10072018 3

మరో పక్క గడ్కారీ కూడా, అన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నారు. చంద్రబాబు అన్నీ అప్డేటెడ్ లో ఉంటారని, నాకు అన్ని వివరాలు చెప్పండి అంటూ, గడ్కరీ సోమవారం ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఎన్ని నిధులను విడుదల చేసింది.. ఇంకా ఎంత ఇవ్వాలి.. పనుల పురోగతి ఎంత వరకు వచ్చింది..పునరావాస ప్యాకేజీ పరిస్థితి ఏంటి... అనే అంశాలపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖపై, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తనకు రాసిన లేఖపైనా మంత్రి చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి ఇచ్చిన నివేదికలోని సిఫారసులపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు పోలవరం పై చెప్తున్న అబద్ధాలు రేపటితో, బట్టబయలు కానున్నాయి. గడ్కరీ అన్ని విషయాలు చెప్తారు కాబట్టి, వీళ్ళు చెప్పినవి అన్నీ అబద్ధాలే అని రేపటితో తేలిపోనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read