చింతలపూడి ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నెల 15న నీటిని విడుదల చేసి, ఆ పథకాన్ని జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం తాళ్లపూడి మండలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ పథకంలో స్టేజ్‌-1లో జరుగుతున్న పనులను పరిశీలించి ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2015 ఆగస్టు 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశామని, అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు 15న చింతలపూడిని జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఆ తేదీ నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను, సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు.

chintalapudi10072018 2

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ఎగువ ప్రాంతాల నీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధమయింది. గోదావరి నుంచి 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు సరఫరా చేసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండోదశపై రాష్ట్ర జల వనరుల శాఖ మొదలు పెట్టింది. ఫేజ్‌-2లో 138.67 క్యూసెక్కుల నీటిని ప్రస్తుత చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ పథకం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాల పరిధిలో మెట్టభూములకు ఉద్దేశించబడింది. ఈ పథకం వల్ల కృష్ణా జిల్లా తిరువూరు, నందిగామ, గన్నవరం, నూజివీడు శాసనసభ నియోజకవర్గాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం కలుగుతుందని జల వనరుల శాఖ పేర్కొంటుంది.

chintalapudi10072018 3

దాదాపు 4.80 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ. 4,909.80 కోట్లు ఖర్చుతో ఈ ఎత్తిపోతల పథకంకు 2016 సెప్టెంబరు 3వ తేదీనే జి.వో. నెం.94 ద్వారా పరిపాలన ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా గోదావరి నీటిని 2 స్టేజిలలో ఎత్తిపోసి, చింతలపూడి ప్రధాన కాలువకు మళ్ళించి, ఈ కాలువను సాగర్‌ ఎడమ కాలువకు ఒక లింకు కెనాల్‌ ద్వారా కలిపి నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. జి.వో. ఇచ్చిన తరువాత సరిగ్గా ఏడాదిలోనే సెప్టెంబర్‌ 7వ తేదీన రెడ్డిగూడెం మండలంలో మద్దెలపర్వ దగ్గర చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూమిపూజ, పైలాన్‌ ఆవిష్కరణకు ఏ.పి. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సంవత్సరం ఆగుస్ట్ 15 నాటికి ఈ ప్రాజెక్ట్ సిద్ధం కానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read