రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ నిర్మలా సీతారామన్ ను కలిసి, ఎక్స్‌అప్రెంటిస్ ఉద్యోగుల సమస్యలు చెప్పారు అంటూ సాక్షి ఊదరగొట్టింది. అయితే ఉన్నట్టు ఉండి, ఈ చిన్న విషయం పై ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని వెనుక పెద్ద కధే ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక్క రోజులోనే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే, ఈ రోజు శుక్రవారం కావటంతో, మనోడు 11 సిబిఐ కేసుల్లో, బెయిల్ పై బయట తిరుగుతున్నాడు కాబట్టి, కోర్ట్ కు పోవాలి. అందుకే మళ్ళీ హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. అయితే, మళ్ళీ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయిని సమాచారం. ఇంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి, చేసేది ఏంటి అంటే, గాలి జనార్ధన్ రెడ్డికి లాబీయింగ్ అనే వార్తలు వస్తున్నాయి.
ఉక్కు పరిశ్రమ కోసం, ఒక పక్క సియం రమేష్, గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో దగ్గర ఉండి, కేంద్ర మంత్రిని కలిసి, కావలసిన డేటా అంతా నేతలు ఇస్తున్నారు. దీంతో, ఉక్కు పరిశ్రమ పై, ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్రానికి వచ్చింది. ఈ నేపధ్యంలో, కడప ఉక్కు పరిశ్రమ గాలికి కట్టబెట్టేలా, విజయసాయి లాబీయింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఉక్కు పరిశ్రమ పెట్టే అవకాశం లేదని రిపోర్ట్ ఇప్పించి, ప్రైవేటు ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, దానికి గాలి రెడీగా ఉన్నాడు అంటూ, ప్లాన్ చేసేలా, విజయసాయి రెడ్డి కధ నడుపుతున్నట్టు తెలుస్తుంది.
కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో. ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు అప్పగించింది. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాబీయింగ్ చూస్తుంటే, గాలికి కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది.