నల్లధనాన్ని అరికట్టడానికి మేము చించేస్తున్నాం, పొడిచేస్తున్నాం.. మా మోడీ మీకు 15 లక్షలు వేస్తాడు అంటూ, ఊదరగొట్టిన బీజేపీ నేతలకు బిగ్ షాకింగ్ న్యూస్. స్విస్ బ్యాంకుల్లో పెరిగిపోతున్న భారతీయుల నల్లధనాన్ని చూస్తే భారత ప్రజలు షాక్ కు గురవ్వాల్సిందే. అకౌంట్లో మనీ పెంచుకోవడమే తప్ప, తగ్గించుకునే పనే లేదంటున్నారు బ్లాక్ మనీ హోల్డర్స్. ఏ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవంటూ నల్లధనాన్ని ఈజీగా దేశం దాటించి సేఫ్ స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చని ఏం చేయదులే అన్న ధీమా బ్లాక్ మనీ హోల్డర్స్ లో పెరిగిపోయినట్లు కన్పిస్తుంది. నోట్ల రద్దు తర్వాతే స్విస్ బ్యాంకుల్లో నల్లధనం 56 శాతం పెరిగిపోయింది.

blck 29062018 2

2017 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం 7వేల కోట్లు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో అన్నీ దేశాల వ్యక్తులకు చెందిన డబ్బు 2017 లో 3 శాతం పెరిగి 100 లక్షల కోట్లుగా ఉందని స్విస్ నేషనల్ బ్యాంక్(SNB) గురువారం(జూన్-28) విడుదల చేసిన యాన్యువల్ డేటా తెలిపింది. 1987 నుంచి స్విట్జర్లాండ్… బ్యాంకుల్లో మనీ వివరాలను ప్రజల ముందు ఉంచుతుంది. నిన్న స్విస్ నేషనల్ బ్యాంక్ విడదల చేసిన యాన్యువల్ డేటా వివరాల ప్రకారం… మూడేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో తగ్గుతూ వస్తున్న భారతీయుల బ్లాక్ మనీ 2017 లో భారీగా 56 శాతం పెరిగింది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ 45 శాతం తగ్గిపోయింది. 2006 చివరి నాటికే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ రికార్డు స్ధాయిలో 23 వేల కోట్లు ఉంది. సుప్రీం కోర్టు సూచనతో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం కేసుని ఛేధించడానికి ప్రభుత్వం ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.

blck 29062018 3

మరో పక్క, ప్రధాని మోడీ ప్రయాణ ఖర్చులు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. 2014లో ప్రధాని పదవి చేపట్టనప్పటినుంచి ఇప్పటివరకూ 41 విదేశీ పర్యటనలు, 52దేశాల్లో నరేంద్రమోడీ పర్యటించారు. బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త భీమప్ప గదాద్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు రూ.355 కోట్లు ఖర్చు అయినట్లు PMO తెలిపింది. ఈ నాలుగేళ్లలో 165 రోజులు విదేశాల్లోనే మోడీ బస చేశారు. ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్‌ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు PMOతెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలోని ఎక్కువదేశాల్లో పర్యటించిన భారత ప్రధానిగా, విదేశాల్లోనే ఎక్కువగా గడిపిన భారత ప్రధానిగా మోడీదే రికార్డు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read