ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ తో గొడవ పెట్టుకుని, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని న్యూస్ చానల్స్ చేత కవరేజ్ లేకుండా చేసుకున్న పవన్ కళ్యాణ్, తనకంటూ ఒక మీడియా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ విషయం పై, పవన్ కళ్యాణ్ దేవ్ టీం, తన సినిమా ఫాన్స్ అందరికీ మెసేజ్ పెట్టి, ఇక నుంచి మనం ఆ ఛానల్ మాత్రమే చూడాలి అంటూ మెసేజ్ లు కూడా పెట్టింది. గతంలో ఒక కమ్యూనిస్ట్ న్యూస్ ఛానల్ టేక్ ఓవర్ చేస్తారని, వార్తలు వాచ్చాయి. అయితే, చివరి నిమిషంలో ఆ డీల్ కాన్సల్ అయ్యింది. తరువాత మానేం ఒక సొంత న్యూస్ ఛానల్ మొదలు పెడదాం అని మెగా ఫ్యామిలీ అనుకుంది, కాని అదీ వీలు పడలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో, ఎదో ఒక న్యూస్ ఛానల్ కావాలనే ఉద్దేశంతో, ఇప్పటికే ఉన్న 99 న్యూస్ చానెల్ ని పవన్ కళ్యాణ్ టేక్ ఓవర్ చేసారు.

janasena 11072018 2

ఈ రోజుతో 99 న్యూస్ చానెల్ కు కొత్త మ్యానేజ్మెంట్ వచ్చింది. అదే విషయం వారి టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ రోజు కొత్త మ్యానేజ్మెంట్ వచ్చిన సందర్భంగా, పూజా కార్యక్రమాలు చేసారు. దీనిలో పవన్ కళ్యాణ్ కు భాగం ఉంది అని చెప్పే విధంగా, ఆపార్టీ నేత తోట చంద్ర‌శేఖ‌ర్, మిగతా జనసేన నాయకులు కూడా ఈ రోజు జరిగిన పూజల్లో ఉన్నారు. దీనిని బట్టి, ఇది పవన్ కళ్యాణ్ టేక్ ఓవర్ ఛానల్ గా దృవీకరించవచ్చని, అంటున్నారు. అయితే, ఈ ఛానల్ కోసం, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు మ్యానేజ్మెంట్ బోర్డు లో ఉంటారు, రోజు వారీ కార్యక్రమాలు చేసేది ఎవరు అనే విషయాల పై క్లారిటీ రావాల్సి ఉంది. న్యూస్ వేవ్ మీడియా పేరుతో 99చానెల్ న‌డ‌ప‌బోతున్న‌ట్టు ఆ ఛానల్ లో స్క్రోలింగ్ వస్తుంది.

janasena 11072018 3

అయితే, ఎన్నికల వరకు మాత్రమే, ఇది జనసేన చేతిల్లో ఉంటుంది అని, తరువాత పరిస్థితిని బట్టి చూస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ వార్తా తెలియటంతో పవన్ అభిమనులు కేరింతలు కొడుతున్నారు. ఇక టీవీ రంగాన్ని ఊపేస్తాం అంటూ హడావిడి చేస్తున్నారు. నిజానికి, ప్రతి రాజకీయ పార్టీకి ఛానల్ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణంగా ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి స్థాపించిన సాక్షి, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని సియం ను చెయ్యటానికి, నానా పాట్లు పడుతుంది. కేవలం టీవీల్లో చెప్పే మన సొల్లు నమ్మేసి, ప్రజలు మనకు ఓట్లు వేసేస్తారు అనుకోవటం, మన పిచ్చి తనం. ఇలా అనుకునే వారికి, సాక్షి టీవీ నే ఒక ఉదాహరణ. టీవీలతో, ట్విట్టర్ లతో సియంలు అయిపోతే, ఇంకా ప్రజల అభిప్రాయలు ఎందుకు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read