మనం ఉండే ప్రపంచంలో, మన చుట్టూ చూస్తూ ఉంటాం... మనం మంచిగా ఉన్నా, సంతోషంగా ఏదన్నా పండగ చేసుకున్నా, మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు.. వాళ్లకి చేత కాదు, మనం కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ, మనం సాధిస్తే మాత్రం, మన మీద పడి ఏడుస్తారు... ఇంకా తేలిక బాషలో చెప్పాలి అంటే సైకోలు అంటారు.. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ లెక్క అనమాట... మనం సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తారు, మనం బాధపడుతూ ఉంటే వారు నవ్వుతారు.. ఇలాంటి వారు సమాజంలో అన్ని చోట్లా ఉంటారు. మన కుటుంబాల్లో, ఆఫీసుల్లో , స్నేహితుల్లో, చివరకు రాజకీయాల్లో కూడా... మన రాష్ట్రంలో అయితే, ఇంకాస్తా ఎక్కువ..
మొన్నటి దాక జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఈ క్యాటగిరీలో ఉండే వాడు. అప్పట్లో వైజాగ్ కి హూద్ హూద్ వస్తే, మా విజయమ్మను ఓడించిన మీకు, తగిన శాస్తి జరిగిందని సంతోషించారు... ఇలాంటి సందర్భాలు ఎన్నో... ఇప్పుడు జగన్ కు తొడు చాలా మంది తయారయ్యారు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇలాంటి వారు వస్తూ ఉంటారు... ఇందులో ఒకాయిన, కొత్తగా ఈ మధ్య తెర మీదకు వచ్చిన జీవీఎల్ నరసింహారావు... గుజరాత్ వీర భక్తుడు... గుజరాత్ మీద ప్రేమ చూపించే ప్రయత్నంలో, సొంత రాష్ట్రాన్ని కూడా, తక్కువ చేసి మాట్లాడే ఘనుడు... నిన్న ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఐటి మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేసారు. మనం మళ్ళీ సాధించాం, ఈ సారి కూడా మనమే నెంబర్ వన్ అంటూ ట్వీట్ చేసారు. దీని పై, మన ఏడుపుగొట్టు జీవీఎల్, ఏడుపుగొట్టు ట్వీట్ చేసారు. "‘‘ఔను మీరు సాధించారు. సులభతర అవినీతి బాగుంది. దేశంలోనే రెండో అవినీతి రాష్ట్రంగా చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు" అంటూ, ఎప్పుడో వచ్చిన సర్వే చూపించి, ఆంధ్రప్రదేశ్ ను తక్కువ చేసి ట్వీట్ చేసారు. నెల రోజుల క్రితం కూడా, మనం అవినీతిలో చివరి స్థానంలో ఉన్నాం అని సర్వే వచ్చినా, ఈ ఏడుపుగొట్టు బ్యాచ్ కు అది కనిపించలేదు. కడుపు మంట, ఉక్రోషం ఇలా తీర్చుకున్నారు. ఈ ట్వీట్ కు, చాలా మంది నెటిజెన్లు జీవీఎల్ కు గడ్డి పెట్టారు. అయినా వీరికి సిగ్గు ఉంటేగా... అయ్యా ఏడుపుగొట్టు బ్యాచ్, ఈ ర్యాంకు వచ్చింది, తెలుగుదేశం పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...