శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈయనను కూడా, ఆంధ్రప్రదేశ్ తర్లలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, రెండు రోజుల క్రితం కత్తి మహేష్ ను కూడా ఇలాగే హైదరాబాద్ నుంచి, చిత్తూరు తరలిస్తుంటే, ఆంధ్రపదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడకు తరలిస్తే, మేము తీసుకొచ్చి, మళ్ళీ హైదరాబాద్ లోనే పడేస్తాం అని చెప్పటంతో, కత్తి మహేష్ ను కర్ణాటకలోని బంధువుల ఇంట్లో దింపారు. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి విషయంలో కూడా, హైదరాబాద్ పోలీసులు, ఆంధ్రాకు తరలిస్తాం అని చెప్తూ ఉండటంతో, ఆంధ్రా పోలీసులు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే కత్తి మహేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ విధించడం గమనార్హం.
ఇందులో భాగంగా.. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపినట్లు తెలుస్తోంది. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు. అయితే, హైదరాబాద్ లో తప్పు చేసినప్పుడు, శిక్ష వెయ్యకుండా, ఇలా బహిష్కరణ అంటూ, అక్కడ నుంచి తీసుకువచ్చి, ఆంధ్రపదేశ్ లో విడిచి పెట్టటం ఏంటో, ఎవరికీ అర్ధం కావటం లేదు. తప్పు ఎక్కడైనా తప్పే కాబట్టి, నిజంగా తప్పు చేస్తే, చట్టం ప్రకారం శిక్షలు వేసుకోవాలి.. దీని వెనుక ఏమి వ్యూహం ఉందో మరి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అయితే, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.