దశాబ్దాలుగా కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసి, రాజకీయంగా పావుగా మారి, చివరకు ఆ వెంకన్ననే రోడ్డుకు లాగిన, శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. రిటైర్మెంట్ నిబంధనలు తీసుకొచ్చి తనను విధుల్లోంచి అకారణంగా తొలగించారంటూ, కేంద్ర పరిధిలోకి కేంద్ర న్యాయశాఖకు కొన్ని రోజుల క్రిందట రమణ దీక్షితులు ఫిర్యాదు చేసారు.. దాని పై కేంద్ర న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ దాన్ని తిరస్కరించింది. ఈ అంశం తమ పరిధిలోకి రావని, సమస్య ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. దీంతో కేంద్రం జోక్యం వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన మాజీ ప్రధాన అర్చకుల భంగపాటు తప్పలేదు.
శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం జరగడం లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని అర్చకులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు, తమను విధుల్లోంచి అకారణంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మే 23న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు మాజీ అర్చకులు ఫిర్యాదు చేశారు. కేంద్రన్యాయశాఖ కార్యదర్శి డీసీ పతక్... లేఖను రమణదీక్షితులుకు తిప్పి పంపారు. టీటీడీ పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రమణదీక్షితులుకు కేంద్ర న్యాయశాఖ సూచించింది.
కోర్ట్ కు వెళ్ళకుండా, కేంద్ర న్యాయ శాఖ దగ్గరకు వెళ్ళటం కూడా ప్లాన్ లో భాగంగా జరిగిందే. కేంద్రంలో పెద్దల సలహా మేరకు, ఈ విధంగా దీక్షితులు చేసారు. అయితే, కేంద్ర న్యాయ శాఖ పరిశీలించి, అనవసరమైన తల నొప్పులు కొని తెచ్చుకోవటమే అని, మనం ఏదన్నా నిర్ణయం తీసుకుంటే, తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కు వెళ్తే, మనకే ఇబ్బంది అని, కేంద్ర పెద్దలకు చెప్పినట్టు సమాచారం. దీంతో, దీక్షితులు విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇప్పుడు, దీక్షితులకు, మిగిలన ఒకే ఒక మార్గం కోర్ట్. అయితే, ఇది వరకే ఒకసారి కోర్ట్, టిటిడి అర్చకుల రిటైర్మెంట్ పై, తీర్పు ఇచ్చింది. అదే ఇప్పుడు దీక్షితులకు కూడా వర్తిస్తుంది. దాని ప్రకారం, స్వామి వారికి సేవ చెయ్యాలి అనుకుంటే చెయ్యవచ్చు కాని, జీతాలు, లేక ఇతర బెనిఫిట్స్ ఏమి రావు అని కోర్ట్ చెప్పింది. మరి, ఇప్పుడు దీక్షితులు తరువాత అడుగు ఏమి వేస్తారో చూడాలి...