పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం స్వయంగా పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని నిధుల మంజూరు, విడుదల విషయంలో రాజకీయాలకు తావులేదని గడ్కరీ పునరుద్ఘాటించారు. అనంతరం నిర్మాణ ప్రగతిపై అదికారుల్తో సమీక్షించారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలసి గడ్కరి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం పనుల తీరు పట్ల గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచుతామన్నారు. నిర్మాణ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ప్రశంసనీయమన్నారు. దేశంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్ట్‌ను తాము పూర్తి చేసి తీరుతామన్నారు.

gadkari 12072018 2

గతంలో తానొచ్చేసరికి కూడా ఇక్కడ కొన్ని సమస్యలుండేవ న్నారు. తన పర్యటన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో వాటిని పరిష్కరించుకున్నా రన్నారు. ఈ సారి కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు నాలుగు రోజులు ఇక్కడే ఉండి పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరించు కోవాలని ఆయన సూచించారు. ఆ స్థాయిలో పరిష్కారం లభించని పక్షంలో సమస్యల నివేదికతో ఢిల్లికి రావాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో ఉన్న సమస్యలు.. వాటి పరిష్కారానికి ఎలా ముందుకు సాగనున్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర అధికారులను దిల్లీకి ఆహ్వానించారు. కూర్చుని తేల్చేద్దామని చెప్పారు. ‘మా అధికారులకు ఇప్పటికే చెప్పా. మళ్లీ చెబుతా. మీరు దిల్లీ వచ్చి ఏ కాగితాలు కావాలో అన్నీ సమర్పించి సమస్యలు పరిష్కరించుకోవాల’ని సూచించారు. మూడు రోజుల్లో నాకు సమర్పిస్తే తాను ఆమోదించి 8 రోజుల్లో ఆర్థికశాఖకు పంపుతామన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి, తాను కలిసి సంయుక్త భేటీ ఏర్పాటు చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. ఎందుకు అంచనాలు పెరిగాయో ఆయనకూ వివరించి ఆమోదం తెచ్చుకుందామన్నారు.

gadkari 12072018 3

కేంద్ర మంత్రి ప్రాజెక్టు చూసిన తర్వాత అక్కడే రాత్రి 9 గంటల వరకు దాదాపు 90 నిమిషాల సేపు అధికారులతో సమావేశమయ్యారు. సవరించిన అంచనాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘ఎంత సమయం తీసుకోవచ్చు’ అని కేంద్రమంత్రిని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ ప్రశ్నించగా తనకు ఈ రోజు వేరే కార్యక్రమం ఏమీ లేదని ఎంతసేపయినా తనకు సమ్మతమేనని చెప్పి సమావేశం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల వల్లే సేకరించే భూమి విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టే, మా అధికారులని, ఢిల్లీ పంపిస్తామని, మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తారని, అన్ని వివరాలు ఇస్తామని, మీరు చెప్పినట్టు, 8 రోజుల్లో అన్నీ క్లియర్ చేస్తే సంతోషమని చంద్రబాబు బదులిచ్చారు. మీరు రెడీ అంటే, వచ్చే సోమవారం నుంచే, ఈ ప్రక్రియ మొదలు పెడదామని, చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read