దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకొనే ప్లాన్ లో భాగంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ రోజు తెలంగాణాలో పర్యటిస్తున్నారు. అసోం, హరియాణా, త్రిపుర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రాలో అడుగుపెట్టి రాజకీయ సభ పెట్టే పరిస్థుతులు లేకపోవటంతో, తెలంగాణా నుంచే ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టనున్నారు. ఎలా ఎక్కువ స్థానాలు రావాలి, పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఎలా రావాలి అనే, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. ఒకరోజు పర్యటనలో ఆయన బూత్‌స్థాయిలో పార్టీ పరిస్థితిని, సభ్యత్వ నమోదు, మోర్చా కమిటీల ఏర్పాటును సమీక్షించనున్నారు. మైక్రో పోల్ మ్యానేజ్మెంట్ పై, దిశానిర్దేశం చెయ్యనున్నారు అమిత్ షా.
ఇది ఇలా ఉండగా, బీజేపీ ఇటీవలే మొదలుపెట్టిన సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా , అమిత్ షా ఈ రోజు ఈనాడు అధిపతి రామోజీ రావు, పారిశ్రామికవేత్త శ్రీనిరాజు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా, ఈనాడు, టీవీ9ను తమకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడతో అమిత్ షా, ఈ భేటీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా ఆంధ్రాలో, తమ కొత్త స్నేహితులైన పవన్, జగన్ ల పై, మీడియాలో పాజిటివ్ స్టొరీలు వచ్చేలా చెయ్యాలనే ప్రయత్నం చెయ్యనున్నారు. అయితే, ఇలాగే ఇది వరకు జగన్ మోహన్ రెడ్డి వెళ్లి, రామోజీని కలిసినప్పుడు, ఇక ఈనాడులో అన్నీ జగన్ వార్తలే వస్తాయని అందరూ అనుకున్నారు. కాని, తరువాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలకు కావాల్సిన విభజన హామీలు నెరవేర్చకుండా, ఇలా మీడియాను నమ్ముకుంటే ఏమి వస్తుందో అమిత్ షా కే తెలియాలి.
మరో పక్క, అమిత్ షా, జగన్, పవన్ ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే జగన్, ఈ రోజు శుక్రవారం కావటంతో నాంపల్లి కోర్ట్ కు వెళ్ళటానికి హైదరబాద్ వచ్చారు. కోర్ట్ విచారణ పూర్తయిన తరువాత, జగన్, అమిత్ షా ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క, పవన్ నిన్న కంటి ఆపరేషన్ చేసుకున్నారు. పవన్ ను పరామర్శ పేరుతో, అమిత్ షా కలిసే అవకాశం ఉందని, ప్రచారం జరుగుతుంది. మొత్తానికి, తెలంగాణాతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, చంద్రబాబుని దించటానికి, ఈ రోజు తెలంగాణా వేదికగా, ప్లాన్ చెయ్యబోతున్నారు అమిత్ షా.. ఈయనప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...