ప్రకాశం జిల్లాకు, ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్.. ఇన్నాళ్ళు అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నాయి, ప్రకాశం జిల్లాను పట్టించుకోవటం లేదు అనే ప్రకాశం జిల్లా వాసులు కూడా, మాకు ఒక పెద్ద కంపెనీ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది ప్రకాశం జిల్లాకే కాదు, రాష్ట్రం మొత్తానికి గుర్తింపు ఇచ్చే అతి పెద్ద కంపెనీ ప్రకాశం జిల్లాలో రాబోతుంది. ప్రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమ రాబోతోంది. దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడితో, ఏటా సుమారు 25 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. ఇండోనేషియాకు చెందిన ‘ఏపీపీ సినార్‌మస్‌’ సంస్థ దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ కంపెనీ ఏర్పాటైన తరువాత ఆసియాలోనే అతిపెద్ద కాగిత పరిశ్రమ కానుంది.

paper 13072018 12

సినార్‌మస్‌ పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా పెద్దగంజాం ప్రాంతాలను పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులు పెద్దగంజాం సరైన ప్రాంతంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సముద్ర రవాణా ద్వారానే ముడిసరుకు దిగుమతి, ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటారు. అందుకే ఈ సంస్థ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పరిశీలించింది. రెండున్నరవేల ఎకరాల భూమి, తీరంలో జెట్టీ, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు, ఏడాదికి ఒక టీఎంసీ నీరు, 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంటు పరిశ్రమకు అవసరం. ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వం ముందుకొచ్చి, మరిన్ని రాయతీలు ఇవ్వటంతో, ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గింది.

paper 13072018 3

కాగితపు పరిశ్రమ ఏర్పాటు తర్వాత... ప్రతి నిమిషానికి ఒక వాహనం కాగితం లోడ్‌తో కంపెనీ నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగంజాంలోని ప్రతిపాదిత స్థలం నుంచి ఈ వాహనాలన్నీ రైల్వే లైన్‌ను దాటుకుని రావాలి. ఈ ఇబ్బందిని తొలగించేందుకు రూ.40 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించేలా ఇప్పటికే రైల్వే అధికారులతో చర్చలు జరిపారు. ఇండోనేషియా నుంచి సరుకు దిగుమతి, ఎగుమతి కోసం సముద్రంలో జెట్టి నిర్మాణం తప్పనిసరి. రూ.1300 కోట్లతో దానిని నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుబాబుల్ రైతులకు కూడా వరం కానుంది. ఇంత పెద్ద పరిశ్రమ మన రాష్ట్రంలో వస్తూ ఉండటంతో, మన రాష్ట్రంలో సుబాబుల్ రైతులకు మంచి డిమాండ్ వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read