నవ్యాంధ్రలో మనం కట్టుకున్న మొదటి కట్టడం, సచివాలయం. వెలగపుడిలో సకల హంగులతో సచివాలయం ఏర్పాటు అయ్యి, పాలన మొత్తం ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యింది. ముఖ్యమంత్రి మొదలుకుని, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు వివిధ శాఖలు అన్నీ ఇక్కడ నుంచే పని చేస్తున్నాయి. తమ సమస్యలు తీరుస్తారు అని గంపడే ఆశతో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వెలగపూడిలో ఉన్న కొత్త సచివాలయానికి వస్తున్నారు. అయితే, అలాంటి వారు, మారిన నిబంధనలు తెలుసుకుని రావాలి. సచివాలయ ప్రవేశానికి, నిబంధనలు మారాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.

sec 12072018 2

సచివాలయ ప్రధాన ద్వారంలో ప్రవేశానికి ఆధార్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకూ సంబంధిత కార్యాలయం అధికారులు భద్రత విభాగం వారికి కాగితం పై రాసి పంపడమో, ఫోన్‌లో చెప్పడం ద్వారానో లోపలికి పంపమనే వారు. ఇకపై తప్పనిసరిగా ఫొటో ఆధారిత పాస్‌ ద్వారానే అనుమతిస్తారు. సందర్శకులు వచ్చినప్పుడు వారి ఫోన్‌ నెంబరు, ఆధార్‌ సంఖ్యను మంత్రి ముఖ్య కార్యదర్శుల వ్యక్తిగత కార్యదర్శులు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి నమోదు చేస్తారు.

sec 12072018 3

అనంతరం ఒక సందేశం సంబంధిత సందర్శకుడు ఇచ్చిన ఫోన్‌ నెంబరుకు వెళుతుంది. వారు ఆ సందేశాన్ని సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న జీఏడీ కౌంటర్‌ వద్ద చూపితే అక్కడే వారి ఫొటో తీసుకుని పాస్‌ జారీ చేస్తారు. దానిని భద్రతా సిబ్బందికి చూపించి సచివాలయంలోకి ప్రవేశించవచ్చు. ఎక్కువమంది కలిసి ఒకే బృందంగా వస్తే.. వారిలో ప్రధాన వ్యక్తి ఆధార్‌ నెంబరును, మిగిలిన వారి సంఖ్యను పై తరహాలోనే నమోదు చేసి గ్రూప్‌ ఫొటోతీసి పాస్‌ జారీ చేస్తారు. ముఖ్యమంత్రికి సమస్యలు విన్నవించుకునేందుకో, వివిధ శాఖల్లో పనుల కోసమో వచ్చే సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య సాధారణ సందర్శన వేళల్లో సచివాలయంలోకి వెళ్లవచ్చు. వారు కూడా ఆధార్‌ వివరాలను సమర్పించి పై విధానంలోనే పాస్‌ను పొందాల్సి ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read