కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎప్పుడు జనవరి నెలలో చెప్పారు. నేను ప్రతి నెలా వచ్చి పోలవరం చూస్తాను, కాంట్రాక్టర్ల చేత పనులు పరిగెత్తిస్తాను, కేంద్రం నుంచి డబ్బులు వెంటనే వచ్చే విధంగా చేస్తాను అని. అయితే, ఇప్పటికి ఏడు నెలలు అయ్యింది. అడ్రస్ లేరు. కేంద్రంతో తెలుగుదేశం కటీఫ్ తరువాత, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ తరుణంలోనే, ఈ నెల 11న గడ్కరీ, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. సవరించిన అంచనాలు ఫైనల్ అవ్వాల్సిన దశలో, గడ్కరీ పోలవరం సందర్శన, మనకు మంచిది అనే అభిప్రాయం అధికారాల్ ఉంది. ఈ విషయం పై దేవినేని ఉమా మాట్లాడారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

gadkari 02072018 2

పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్మాణం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెడ్ వర్క్స్ 42.16 శాతం, డ్యామ్ ప్రధాన ప్యాకేజీ పనులు 40.65 శాతం, తవ్వకం పనులు 75.80 శాతం, కాంక్రీట్ పనులు 28.40 శాతం, రేడియల్ గేట్ల పనులు 61.30 శాతం, వంద శాతం డయాఫ్రామ వాల్ పనులు, జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం పూర్తి అయినట్లు వివరించారు.

gadkari 02072018 3

కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 61.67 శాతం, అనుసంధాన ప్యాకేజీ పనులు 58.32 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. 1396.6 మీటర్ల డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు పనులు రికార్డు టైమ్ లో పూర్తి చేసినట్లు తెలిపారు. దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే సోమవారానికి పూర్తి అవుతాయన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.8662 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, ఇంకా రూ.1935 కోట్లు రావలసి ఉందని అన్నారు. జూన్ చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్లులను పోలవరం డెవలప్ మెంట్ అథారిటీకి పంపినట్లు మంత్రి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read