కత్తి మహేష్ అనే పేరు, గత కొన్నాళ్లుగా మన తెలుగు వార్తా చానల్స్ లో ఈ మధ్య విస్తృతంగా వినిపిస్తున్న పేరు. సినీ విమర్శకుడిగా పేరు ఉన్నా, పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం, పవన్ ఫాన్స్ తో వైరమ ద్వారా ఆయన బాగా గుర్తిండి పోయారు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో ఆయన నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నోళ్లలోనూ నానుతున్నాడు. నటి శ్రీరెడ్డి విషయంలో ఆయన అనుకూలం గా వ్యాఖ్యానించి మరింతగా ప్రాచుర్యం పొందారు. తాజాగా రాముడి పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇదిలావుంటే, ఒక్కసారిగా ఆయన అనూహ్యమైన నిర్ణయం వెల్లడించా డు. తాను రాజకీయ అరంగేట్రం చేయాలని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నాడు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తాను ప్రజల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని బాంబు పేల్చాడు.
వచ్చే ఎన్నికలకు ముందే తాను వైసీపీలో చేరతానని కత్తి ప్రకటించాడు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే తాను జగన్‌ను కలుస్తానని చెప్పాడు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరనున్నట్టు తెలిపాడు. అయితే, ఈ వ్యాఖ్యలు కత్తి మహేష్ ఉన్నట్టు ఉండి చేసినవి కావని, ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని టాక్ నడుస్తుంది. అసలు పవన్ ఇష్యూ కూడా, జగనే చేపించాడు అనే పుకార్లు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే కత్తికి వైసీపీ నుంచి చిత్తూరు ఎంపీ టికెట్ దక్కడం అంత తేలిక అయితే కాదు. ఇంతకు ముందు అక్కడ నుంచి పోటీ చేసిన సామాన్య కిరణ్ కుటుంబం కి జగన్ తో మంచి సంబంధాలున్నాయి.
మరో ట్విస్ట్ ఏంటి అంటే, సామాన్య కిరణ్, కత్తి కూడా మంచి స్నేహితులు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, కత్తి చేసిన వ్యాఖ్యలు, ఎదో అలా చెప్పినవి కాదు. దీని పై ఇప్పటికే కసరత్తు జరిగిందని, జగన్ ఆశీస్సులతోనే, కత్తి ఇలా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. సామాజిక వర్గం రీత్యా కత్తి ఎస్సీ కాబట్టి.. చిత్తూరు నియోజకవర్గం ఆయనకు సరైందే. అంతేకాదు, ఇది ఆయన సొంతజి ల్లా కూడా! ఈ నేపథ్యంలోనే కత్తి ఇలా కోరుకోవడం, జగన్ కూడా ఓకే అని ఉంటారాని అంటున్నారు. అయితే, కత్తికి ఆర్ధికంగా ఖర్చు పెట్టే స్థోమత లేదు కాబట్టి, ఆ విషయంలో జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మనోడికి ఎదురు తీసుకోవటమే కాని, తన దగ్గర ఉన్నది ఇవ్వటం అలవాటు లేదు కాబట్టి, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో క్లారిటీ అడిగారని, ఆ విషయంలో క్లారిటీ వచ్చినాకే, కత్తి విషయంలో ఫైనల్ గా జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.