అనుకున్నదే జరిగింది... పోలవరం పై కక్షతో, కేంద్రం మరోసారి మనకు పరీక్షలు పెడుతుంది... పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం లభించలేదు. దీంతో ప్రాజెక్టు పనులపై అనిశ్చితి నెలకొంది. ఈ ఫైల్ పై, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులు ఆమోదముద్ర వేసి కార్యదర్శి సీకే మిశ్రాకు పంపారు. ఆయన నుంచి అనుమతి పొందడానికి సోమవారం రాత్రి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఈ ఫైల్ కి ఆయన ఆమోదముద్ర వేస్తే, కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు చేరుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి దిల్లీకి చేరుకుంటారని అధికార వర్గాల సమాచారం. ఆలోపు పర్యావరణశాఖ కార్యదర్శి పచ్చజెండా ఊపితే కేంద్ర మంత్రి దిల్లీకి వచ్చిన వెంటనే ఫైల్ పై తుది ముద్ర వేసే అవకాశం ఉంటుంది. ఏదన్నా రాజకీయ కారణం చూపితే మరికొంత జాప్యం జరిగే ప్రమాదం ఉందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయితే, అప్పటి వరకు పనులు కొనసాగించాలా లేదా అన్న దాని పై, అనిశ్చితి నెలకొంది. పోయిన సారి ఇలాగే లేట్ అయితే 2 రోజులు పనులు ఆగిపోయాయి. మరి మారిన రాజకీయ పరిస్థుతుల నపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని కేంద్రం చూస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఒక్క రోజు కూడా వేస్ట్ చెయ్యకుండా, చంద్రబాబు పనులు పరిగెత్తిస్తున్నారు. మరి ఇప్పుడు పనులు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. పోలవరం పనుల నిలిపివేతకు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వకూడదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు జూన్ 2న ఆయన కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా నవీన్ లేఖకు కౌంటర్‌గా హర్షవర్థన్‌కు లేఖ రాశారు. తక్షణం ‘స్టాప్ వర్క్ ఆర్డర్’పై స్టే జారీచేసి పోలవరం పనులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ ఆర్డర్‌పై గత ఏడాది జులై 3న ఇచ్చిన స్టే సోమవారం (జూన్ 2)తో ముగిసింది. ఇప్పుడు కేంద్రం మళ్లీ దాన్ని పునరుద్ధారించాల్సి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెదేపా బయటకు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి మెలికపెడుతుందోనన్న ఆందోళన ఏపీ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) 2015 చివరిలో ‘స్టాప్ వర్క్’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జావడేకర్ ఆ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలను అనిల్ దవే స్వీకరించారు. స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. జూలై 2వ తేదీతో స్టే గడువు ముగిసింది.