లంచం అడిగితే ఫోన్ చేయమంటూ ఎమ్మెల్యే యరపతినేని ప్రజలకిచ్చిన పిలుపునకు స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను ఆయనే స్వయంగా స్వీకరిస్తున్నారు. మాముళ్లను తిరిగి క్కిస్తున్నారు. పిడుగురాళ్లకు చెందిన ఒక వ్యాపార, దాచేపల్లికి చెందిన ఒక రైతు లంచంగా ఇచ్చిన సొమ్మును ఎమ్మెల్యే తిరిగి ఇప్పించారు. పిడుగురాళ్లకు చెందిన వ్యాపారికి ఓ ఆధికారితో చిన్న పని పడింది. ఆందుకుగాను రూ.లక్ష డిమాండ్ చేయడంతో ముట్టచెప్పాడు. అయినా పని జరగలేదు. బాధితుడు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని ఎమ్మెల్వే యరపతినేని దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారిని పిలిపించి మొత్తం సొమ్మును తిరిగి ఇప్పించారు.
దాచేపల్లికి చెందిన రైతు కూడా ప్రభుత్వ కార్యాలయంలో అనుభవించిన లంచం యాతనను ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇది జరిగిన అరగంటలో బాధ్యులైన అధికారులు సదరు రైతుకు తీసుకున్న మొత్తం ఇవ్వటంతో పాటు, అరపూటలో పని చేసి పెట్టారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలుకు, వివిధ పనులు చేసేందుకు లంచాలు డిమాండ్ చేస్తున్న వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. సమస్యను ఎమ్మెల్వే దృష్టికే తీసుకెళ్లే అవకాశం ఉండటంతో అవినీతికి ఆలవాటు పడ్డవారు పెట్టేబేడ సరుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఆధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తారు అటువంటి పరిస్థితిల్లో వారే ప్రజలకు సమస్యగా మారుతున్న సందర్బాలు వినపడుతుండటంతో అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య దళారులను నిరోధించేందుకు ప్రాధాన్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైరెక్ట్‌గా ఎమ్మెల్యే దృష్టికే సమస్యను తీసుకెళ్లే అవకాశం దక్కుతుండటంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, "ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి ఆధిక ప్రాధాన్యం ఇస్తుంది. సబ్సిడీ రుణాలు, గృహరుణాలు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల మేలు కోసం చేపట్టినవే. ఎవరెవరికో లంచాలు ఎందుకివ్వాలి?. వాళ్లకు వచ్చే కొద్దిపాటి ప్రయోజనంలో లంచాలు పప్పు బెల్లాలైతే ప్రజలకు మిగిలేదేముంటుంది?, ఈ విషయంలో ఎంతటి వారినైనా సహించేది లేదు లంచాల కోసం ఎవరైనా పీడిస్తుంటే సెల్ నెంబర్ 97033 55955 కు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ ఎమ్మల్యే చెప్పారు.