వైసీపీ నేత జగన్‌ను ఎన్డీయే కూటమిలో చేరాలంటూ రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్య రాబోయే అసలు సినిమాకు ముందస్తు కొసరని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘బీజేపీ, వైసీపీ అపవిత్ర పొత్తుకు సంబంధించిన అసలు సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఇది ముందస్తు ట్రైలర్. తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడితే తెలుగు ప్రజలు చూస్తూ మౌనంగా ఊరుకోరు. 2019లో వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం’ అని ఆయన పేర్కొన్నారు. నిన్న కేంద్రమంత్రి రాందాస్ అథవాలే హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో పెద్ద చర్చనీయంసం అయ్యాయి. వైసిపీ - బీజేపీ ఇంత తొందరగా బహిరంగంగా కలిసిపోతారని ఎవరూ ఊహించలేదు.
జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు మేము కృషి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పటం, అందరినీ అవాక్కయేలా చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. నేను ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత తీసుకుని, జగన్ ను సియం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చ జరగటంతో, లోకేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేసారు. "Sri Ramdas Athawale’s comment about Jagan joining NDA is a trailer before the final film on the unholy alliance between YCP & BJP hits the theatres. People are no fools to sit quiet & watch Jagan placing Telugu pride on the feet of BJP bosses. They will flop the film in 2019!"
మరో పక్క అన్నక్యాంటీన్ల పై కూడా లోకేష్ ట్వీట్ చేసారు. అన్నక్యాంటీన్లను జాతీయ మీడియా ఆకాశానికెత్తేస్తూ కధనాలు వేసింది. అన్నక్యాంటీన్లపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్‌ను నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఐబీటీ, బిజినెస్ స్టాండర్డ్, ఏఎన్ఐ, డెక్కన్ క్రానికల్‌తో పాటు ఓ తమిళ పత్రికల్లో కధనాలు వచ్చాయి. దీని పై లోకేష్ ట్వీట్ చేస్తూ, 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు .. టీడీపీ సూపర్‌హిట్ అని ఆనాడు ఈనాడు దినపత్రిక ప్రచురించిందని.. ఈ రోజు టీడీపీ ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ల గురించి జాతీయ పత్రికలన్నీ కథనాలను ప్రచురించాయని లోకేశ్ ట్వీట్ చేశారు.