ఈ నెల 11న ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి రావాలని, తన సమక్షంలోనే అధికారులతో సమావేశమై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం బావుంటుందని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా ఢిల్లీ వెళ్లి వెంటనే సమస్య పరిష్కారం చేసి, పోలవరంలో అన్ని అనుమతులు పొందటానికి, రేపే అధికారులని హుటాహుటిన ఢిల్లీకి పంపిస్తున్నారు చంద్రబాబు. నవ్యాంధ్రకు గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టుకు తాజాగా ఏర్పడిన అవాంతరాలను అధిగమించేందుకు చంద్రబాబునాయుడు అధికారులతో కూడిన ఒక ప్రతినిధి బృందాన్ని సోమవారం ఢిల్లీకి పంపించాలని నిర్ణయించారు. ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ అహో రాత్రులు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ముఖ్యమంత్రి శనివారం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

delhi 15072018 2

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పోలవరం వచ్చిన సందర్భంలో ప్రాజెక్టుకు సంబంధించిన తాజా డీపీఆర్ తో పాటు భూసేకరణ, ఆర్ ఆర్ ప్యాకేజీ, పరిహారం, పునరావాసం, సవరించిన అంచనాల విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనత్తిన సంగతి తెలిసిందే. ముందస్తు నిధుల విడుదల గురించి కూడా సీఎం ఆరోజు నితిన్ గడ్కరీని అడిగారు. కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు. పైగా ఆ డాక్యుమెంట్లు లేవు.. ఈ డాక్యుమెంట్లు లేవు. తాజా డీపీఆర్ సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టారు. పైగా రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఎంత త్వరగా ఢిల్లీ వచ్చి, రెండో డీపీఆర్ కు సంబంధించిన లెక్కలతో కూడిన సంబంధిత దస్త్రాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందజేయాలని ఆ రోజు నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రిని ప్రాజెక్టు సైట్లోనే కోరారు. దీంతో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకుని, రెండో డీపీఆర్ కు సంబంధించిన లెక్కలుతో కూడిన అన్ని దస్త్రాలను తాజాగా సిద్దం చేయించారు.

delhi 15072018 3

దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని దస్త్రాలతో అధికార బృందాన్ని సోమవారం ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. జలవనరుల శాఖాధికారులతో పాటు ఆర్థిక శాఖ, రెవిన్యూ శాఖ నుంచి పలువురు అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ లేవనెత్తిన అన్ని అంశాలను ఢిల్లీలో ఈ అధికారుల బృందం ఆర్ధిక మంత్రిత్వ శాఖాధికారులను కలిసి, సందేహాలను నివృత్తి చేయనున్నది. ఈ బృందం ఢిల్లీలో పెద్దలను కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పేద్దలంతా ఢిల్లీకి తరలి వెళ్లేందుకు కూడా పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ముందస్తు నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను ఇంతవరకు కేంద్రం విడుదల చేయకపోగా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడంతో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టు పనులను అనేక ప్రతికూల పరిస్థితుల్లో నిర్వహిస్తున్న క్రమంలో కేంద్రం రకరకాల కారణాలతో అడ్డుపుల్లలు వేస్తుండడంతో ప్రాజెక్టు పనులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఒక వేళ చర్చల్లో కేంద్రం ఏమన్నా ఇబ్బందులు పెడితే, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.బాబు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read