ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది అంటే, పక్కవాళ్ళని ఆట పట్టించి, "ఏప్రిల్ ఫూల్" అంటాం. అల ఎందుకు అంటామో, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే, యూరప్ గురించి చెప్పాలి. 1582వ సంవత్సరం దాక యూరప్ లో నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేదీ వరకు, పది రోజుల పాటు గ్రాండ్ గా జరుపుకునే వారు. 1582లో అప్పటి ఫ్రాన్స్ రాజు తొమ్మిదో ఛార్లెస్ అప్పటి వరకు ఫాలో అయిన క్యాలెండర్ ను మార్చేసి, గ్రెగేరియన్ క్యాలెండర్ ను ఆమోదించాడు.
ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ప్రజలకి రాజుగారి ఆదేశం చేరలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజు ఆదేశం ప్రకారం చాలా మంది ప్రజలు జనవరి ఫస్ట్ రోజున కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజుగారి ఆదేశం తెలియని వాళ్లు పాత పద్ధతిలో ఏప్రిల్ ఫస్ట్ వరకు ఆగి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
న్యూ ఇయర్ గా జనవరి ఫస్ట్ న వేడుకలు చేసుకున్న వాళ్లు, ఏప్రిల్ ఫస్ట్ ను సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూఆటపట్టించారు. పేపర్తో చేప బొమ్మలు తయారుచేసి వాళ్ల వెనక భాగాన కట్టి ఆటపట్టించేవాళ్లు. గేలానికి దొరికే చేపలకింద జమ కట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ ఆటపట్టించేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డే గా మారిపోయింది. ఇలా ఆటపట్టించే విధానం తరువాత ప్రపంచం అంతా పాకింది. ఇదీ ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ.